పెద్దపల్లి ఏర్పాటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.703 టీసీల నీరు నిల్వ ఉంది. ఏకంగా 4,16,358 క్యూసెక్కుల భారీ ప్రాజెక్టు ఇన్ ఫ్లో వస్తుండగా… ఇందులో కడెం ప్రాజెక్టు ద్వారా 1,56,279 క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ద్వారా 2,60,079 క్యూసెక్కుల నీరు చేరుతోంది.
►ఇంకా చదవండి | కుండపోత వర్షాలు..తెలంగాణలో ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 3,90,300 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో కింద విడుదల చేస్తున్నారు. అధికారులు 30 గేట్లను ఎత్తి 3,74,275 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

