లక్నో: దేశంలో ఎండలు ఎక్కువగా కొట్టే రాష్ట్రమనగానే అందరికి టక్కున రాజస్థాన్ గుర్తుకొస్తోంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఎడారి ఉండటంతో నార్మల్‌గానే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. కానీ దేశంలో ప్రస్తుత నమోదైన నగరం రాజస్థానం లేదు. హయ్యెస్ట్ టెంపరేచర్ నమోదైన నగరం దేశంలో ఉత్తరప్రదేశ్‌లో ఉంది. యూపీలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్న బాందా జిల్లాలో మంగళవారం (మే 19) 48.2 డిగ్రీల సెల్సియస్ రికార్డు నమోదైంది.
రాజస్థాన్‌ను కూడా దాటేసి దేశంలోనే అత్యంత వేడి ప్రాంతంగా బాందా జిల్లా మారింది. దీంతో ఎడా ప్రాంతమైన రాజస్థాన్‌ను కూడా క్రాస్ చేసేంత రికాస్డ్ స్థాయిలు బందా జిల్లాలో ఎందుకు నమోదు అవుతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
బండా జిల్లా అగ్నిగోళంలో ఎందుకు మారుతోంది..?
సంవత్సరాల తరబడి స్థానికంగా జరిగిన పర్యావరణ విధ్వంసం బండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవడానికి ప్రధాన కారణమని పరిశోధకులు, వాతావరణ నిపుణులు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో మైనింగ్, బ్లాస్టింగ్, నదీ క్షీణత, భూగర్భ జలాల పతనం, నివాస నిర్మూలన వంటి పలు కారణాలతో బండ జిల్లాలో పర్యావరణం నాశనమవుతోంది. ఫలితంగా ఆ జిల్లాలో రికార్డ్ స్థాయిలు నమోదు అవుతున్నాయి.
►ఇంకా చదవండి | నటి ట్విషా శర్మ మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం అవసరం లేదు: భోపాల్ కోర్టు కీలక తీర్పు

