తానా మదర్స్ డే సెలబ్రేషన్స్: అమెరికాలోని ఛార్లెట్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మే 16న నిర్వహించిన మదర్స్ డే వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. దాదాపు 500 మందికి పైగా మహిళలు హాజరుకావడం విశేషం. తల్లులతో పాటు కూతుళ్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను ప్రత్యేకంగా నిలిపారు. ఛార్లెట్‌లో ఒకే ఇంతమంది మహిళలు రావడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు.
ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు, వినోద కార్యక్రమాలు, విందు భోజనాల వేడుకలు సందడిగా జరిగాయి. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ పేజీ తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, జాయింట్ ట్రెజరర్ రాజేష్ యార్లగడ్డ, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని ప్రమేయం ఉంది.

తానా హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మాధురి ఏలూరి ప్రారంభం నుంచి కార్యక్రమ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించి, వచ్చిన వారందరూ ఆనందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ వేడుక విజయవంతానికి నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, రవి (నాని) వడ్లముడి పని చేశారు.

వర్జీనియా నుంచి విచ్చేసిన ‘అందెలరవమిది’ ఫేమ్ ఇంద్రాణి దావలూరి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళల ప్రాముఖ్యతపై ప్రసంగించారు. సిన్సినాటి నుంచి వచ్చిన ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మమ్మడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన, గేమ్స్‌లో సందడి చేశారు.

యాంకర్ స్రవంతి ప్రత్తిపాటి తనదైన శైలిలో చక్కగా నడిపించగా, సింగర్ స్నిగ్ధ ఎల్లేశ్వరపు ఆలపించిన మధుర గీతాలు ప్రేక్షకులను అలరించాయి.

కార్యక్రమ నిర్వహణలో సహకరించిన పద్మజ కొమ్మినేని, జ్యోత్స్న గంట, సౌమ్య శ్రీ తల్లాంకి, ఝాన్సీ అబ్బూరి, జ్యోత్స్న కాండ్లగుంట సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.



