విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మారుతీ నగర్‌కు చెందిన మెహబూబ్ షరీఫ్ ఖాన్ కుమార్తె తానియా ఖాన్ (17 సంవత్సరాలు) మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని టూటౌన్ పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు స్నేహితులను, బంధువులను విచారించిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బాలిక ఎవరికైనా కనపడిన యెడల సెల్ నెంబర్ 9347298729 కు గాని టూ టౌన్ పోలీసులకు గాని తెలపాలని తెలిపారు.

