ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్ఎఫ్ టీవీటీడీసీ చైర్మన్ గా పి. భరత్ భూషణ్ ను నియమించింది. వైస్ ఛైర్మన్‌గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు మరో 14 మంది సభ్యులను ప్రభుత్వం నియమించింది.
పీఎస్ఎఫ్ టీవీటీసీ డైరెక్టర్లు గా సుమన్ తల్వార్, ఎస్. శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయిమాధవ్వై. ఝాన్సీ, కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద, వి. సముద్ర, కే. ఉమామహేశ్వర రావు, మీఆర్.ఎస్, కందిమళ్ల సాంబశివరావు, ఏ. సత్యనారాయణ, ఎస్. వెంకట కృష్ణారెడ్డి, జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణ లను నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది.

