వైసీపీకి సీనియర్ నేతలు షాక్: ఏపీలో రాజ్యసభ పదవుల సందడి మొదలైంది. నలుగురు పదవీ విరమణ చేయనున్నారు. ఆ నాలుగు పదవులు కూటమికి దక్కనున్నాయి. అయితే రాజ్యసభ పదవులకు ముగ్గురు వైసీపీ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో ఇద్దరు పరిస్థితి ఏంటనేది తెలియాల్సి ఉంది. వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు బిజెపిలోకి వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ నడుస్తోంది. ప్రధానంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చుట్టూ ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది. ఇందులో సుభాష్ చంద్రబోస్ టిడిపి వైపు.. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బిజెపి వైపు వెళ్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వచ్చేనెల 21తో వారి రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. వారి స్థానంలో వారి కొత్త ఎంపిక కోసం ఈరోజు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
నలుగురి పదవీ విరమణ..
ఏపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళనత్వాని, సానా సతీష్ పదవి విరమణ చేయనున్నారు. ఇందులో సతీష్ టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు. ఏడాది కిందట ఆయనకు రాజ్యసభ పదవి దక్కింది. ఆ సమయంలోనే మరోసారి రెన్యువల్ ఇచ్చిన హామీ ఇచ్చారు. మరోవైపు పరిమళనత్వాన్ని బిజెపి కోటాలో అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అయితే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయ అడుగులు ఎటు వేస్తారా అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు ఇద్దరు నేతలు. అందుకే గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది.
ఆది నుంచి ఆళ్ల ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వస్తోంది. పార్టీకి అండదండగా నిలుస్తూ వచ్చారు అయోధ్య రామిరెడ్డి. ఆయన స్వతహాగా పారిశ్రామికవేత్త కూడా. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆయన వెంట అడుగులు వేస్తారు. అందుకే జగన్ ఆయనకు సుదీర్ఘకాలం రాజ్యసభ పదవి కట్టబెట్టారు. ఆయన సోదరుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంగళగిరి టిక్కెట్లు రెండుసార్లు ఇచ్చారు. రామకృష్ణారెడ్డి రెండుసార్లు కూడా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మాత్రం మొండి చేయి చూపారు. అప్పటినుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పార్టీపై అసంతృప్తితో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఏదో ఒక నిర్ణయానికి వస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది.
కుమారుడి కోసం..
పిల్లి సుభాష్ చంద్రబోస్ ది అదే పరిస్థితి. ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ మంత్రిగా కూడా వ్యవహరించారు. తర్వాత జగన్ వెంటే అడుగులు వేశారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అందుకే జగన్ ఆయనకు రాజ్యసభ అవకాశం ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన కుమారుడికి టికెట్ అడిగితే జగన్ నిరాకరించారు. అప్పటినుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడిచింది. ఇప్పుడు భవిష్యత్తులో కుమారుడికి వైసీపీ టికెట్ దక్కేలా లేదు. ఆయన అందుకే సీరియస్ గా ఆలోచన ఉంది. టిడిపి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఇద్దరు రాజ్యసభ పదవులు వదులుకున్న తర్వాత వైసీపీకి గుడ్ బై చెబుతారనే టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

