రేపు హైదరాబాద్ లో బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్కు ముందుగానే టిక్కెట్లను కొనుగోలు చేసి కొందరు బ్లాక్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ముఠాను పోలీసులు కనుగొని వారిని కఠినంగా శిక్షించాలని క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. నిమిషాల్లోనే ముప్పయి తొమ్మిది వేల టిక్కెట్లు మాయమయ్యాయి.
ఉప్పల్లో రేపు బెంగళూరు, హైదరాబాద్లో మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వస్తారని భావించి ముందుగానే టికెట్లు కొని బ్లాక్లో ముఠా అమ్ముతున్నట్లు పోలీసులు కూడా పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్కు టికెట్లు తరలించారని అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ టికెట్ల దందాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న వారిపై 10 కేసులు నమోదు చేశారు.

