ఆంధ్రప్రదేశ్:మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ రిజర్వ్ ప్రాంతంలో(టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతం) గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం కలకలం రేపుతోంది.అటవీశాఖ అధికారులు, ట్రైబల్ వాచర్ల సహాయంతో తవ్వకాలు జరిపి లంకెబిందెలను వెలికితీశారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మార్కాపురంలో గుప్తనిధుల తవ్వకాల్లో లంకెబిందెలు బయటపడ్డాయన్న సమాచారం కలకలం రేపుతోంది.ఓ గుప్తనిధుల ముఠా సమాచారంతో జిల్లాశాఖ అధికారులు గుప్త నిధులను తవ్వి అందులో లభించిన లంకెబిందెల్లో సొమ్ము స్వాహా చేసి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.మార్కాపురం జిల్లా తురిమెళ్ళ క్షేత్ర స్థాయి అధికారులు.
ట్రైబల్ వాచర్లతో కలిసి గుప్తనిధులు తవ్వకాలు జరిపినట్లు అనుమానిస్తున్నారు.ఈ తవ్వకాల్లో ఓ పెద్ద మట్టిండలు బయటపడగా అందులో వజ్రాలు,బంగారం రెండు వరకు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
దొరికిన బంగారం,వజ్రాలను తొలుత హైదరాబాద్లో అమ్మేందుకు ప్రయత్నించి అది విఫలమవడంతో బెంగళూరులో అధికారులు అమ్ముకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ సమాచారం గురించి శాఖ అధికారులను( అటవీ అధికారులు ) మీడియా వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికారులు స్పందించడం లేదు.మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డివిజన్లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.యర్రకుంట్ల సమీపంలో ఓ నెలకిందట ఈ తవ్వకాలు చోటుచేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వెలగలపాయ ఫారెస్ట్ బీట్ అధికారికి యర్గొండపాలెంకు చెందిన కొందరు గుప్తనిధుల ముఠా సభ్యులు విచారణ సందర్భంగా ఇచ్చిన సమాచారం మేరకు ఈ తవ్వకాలు చేసినట్లు తెలిసింది…గిరిజన ట్రైబల్ వాచర్ల సాయంతో భారీగా తవ్వకాలు జరిపి గుప్తనిధుల కుండలు వెలికితీసి, ఆ బంగారం తీసినట్లుగా చెబుతున్న వీడియో ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.ఈ లంకెలు కొడుతోంది.
ఈ ఘటనలో అధికారులు తీసుకున్న వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో కూడా స్వయంగా పోస్ట్ చేశారట.గుప్త నిధుల తవ్వకాల వ్యవహారం పోలీసులకు అందడంతో స్థానిక పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిసింది.
పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.


