కర్నూలు రౌడీలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మంత్రి సత్య కుమార్ యాదవ్ పై హరీష్ బాబుతో పాటు ఆరు మంది హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డిపై దాడి చేసిన దారుణమని మంత్రి అనుచరులను, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయించారు అంజన్ రెడ్డి సోదరుడు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్. ఈ సందర్భంగా పట్టణంలోని కళా జ్యోతి సర్కిల్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద తీవ్ర నిరసన తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి అనుచరుల ఆగడాలు ధర్మవరం పట్టణంలో పిచ్చిమీరుతున్నాయని, అరికట్టాల్సిన ప్రజాప్రతినిధులు ఏమి చేయలేకపోవడం దారుణమన్నారు. కర్నూల్ రౌడీలను నియంత్రించకపోతే తిరిగి ధర్మవరంలో ఫ్యాక్షన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని వారు తెలిపారు. ఇంకా పట్టణానికి స్థానికేతరులు వచ్చి స్థానికులపై దౌర్జన్యం దాడులు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. అతి త్వరలో తరిమి కొడతామని వారి హెచ్చరిక. అంజన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తే తప్పు ఏంటని ప్రశ్నించారు. దాన్ని అడిగే పద్ధతిలో అడగాలని గాని, దాడులు ఎలా చేస్తారు అని వారు తీవ్రంగా ఊహించారు. ధర్మవరం ప్రజలు మంత్రిని ఎంతగానో నమ్మి ఓటు వేసి గెలిపిస్తే ఆయన ఇక్కడ కర్నూలు నుంచి పెట్టడం సమంజసం కాదని చెప్పారు. అమాయకులైన బిజెపి మహిళలను హనీ ట్రాప్లో బదరాయించడం వారు గుర్తు చేశారు. హనీ ట్రాప్ పై సి బి సి ఐ డి ద్వారా విచారణ జరిపితే అన్ని బయటకు పడతాయని చెప్పారు. ఏది ఏమైనా అంజన్ రెడ్డికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటాలు కొనసాగుతాయి. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు చూడగల గిరిధర్ చిలకం సూర్యనారాయణ రెడ్డి ,సేక్షావలి, వీరన్న, రాము, నారాయణస్వామి, గండిమినేని నారాయణస్వామి పాల్గొన్నారు.

