గ్రానైట్ అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు సంపాదించాడు ఓ వ్యక్తి. భార్య మొబైల్ నెంబర్ తో ఫేక్ ఇన్వాయిస్ లు తయారు చేసి.. ఈవే బిల్లులు సృష్టించి.. నకిలీ సంస్థను క్రియేట్ చేసి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించకుండా వెనకేసున్నాడు. ఈ కేసులో 2026 మే 21వ తేదీన కరీంనగర్‌కు చెందిన దాసరి శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు DGGI హైదరాబాద్ అధికారులు.
CGST చట్టంలోని సెక్షన్ 69 కింద అరెస్ట్ శ్రీకాంత్‌ను అరెస్టు చేసిన అధికారులు.. సెక్షన్ 132(1)(a) కింద కేసు నమోదు చేశారు. నకిలీ GST సంస్థ మనోజ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో భారీ గ్రానైట్ అక్రమ రవాణా చేసినట్లు పేర్కొన్నారు. ఇన్వాయిసులు, ఈ-వే బిల్లులు లేకుండా గ్రానైట్ స్లాబ్‌ల రవాణా ఉన్నట్లు పేర్కొన్నారు.
రూ.80–100 కోట్ల విలువైన ఈ-వే బిల్లులు జనరేట్ చేసి GST రిటర్నుల్లో నిల్ ఫైలింగ్ చేశాడు. ప్రభుత్వానికి సుమారు రూ.16.96 GST ఎగవేత జరిగినట్లు DGGI అంచనా వేసింది. భార్య మొబైల్ నంబర్‌తో ఫేక్ ఇన్వాయిసులు, ఈ-వే బిల్లులు సృష్టించిన శ్రీకాంత్.. స్నేహితుడి బ్యాంక్ అకౌంట్ GST రిజిస్ట్రేషన్‌కు లింక్ విచారణలో వెల్లడైంది.
మనోజ్ తారా పేరుతో నకిలీ సంస్థ నమోదు చేశారు. అసలు వ్యక్తికి సంస్థపై అవగాహన లేదని సమాచారం. ఆధార్, PAN వివరాలను దుర్వినియోగం చేసి ఫేక్ GST సంస్థ సృష్టించిన గ్రానైట్ సిండికేట్‌ను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న ముఠా గుట్టు బట్టబయలు చేశారు. దీని వెనుక రాజస్థాన్‌కు చెందిన వారు ప్రమేయంపై DGGI దర్యాప్తు చేస్తోంది.
షేర్లింగంపల్లి, ఘట్కేసర్లోని అక్రమ గ్రానైట్ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. ప్రగ్నాపూర్ వద్ద గ్రానైట్ స్లాబ్‌లతో వెళ్తున్న ట్రక్కులు సీజ్ చేశారు. నగదు లావాదేవీలు ట్రక్ డ్రైవర్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. బ్రోకర్లు, గ్రానైట్ మార్కర్లు, ఫ్యాక్టరీలతో కూడిన భారీ ఫేక్ ఈ-వే బిల్ రాకెట్ వెలుగులోకి వచ్చాయి.

