Jagan Vs Balineni: మరికొద్ది క్షణాల్లో ఏపీలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలో మీడియా ముందుకు రానున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు వచ్చిన ఆయన తాడేపల్లికి ఈ వారం వచ్చారు. తిరిగి బెంగళూరుకు వెళ్తూ వెళ్తూ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అదే సమయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ యధాలాపంగా కూటమి ప్రభుత్వాలపై నడవనుంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం సాక్షి మీడియాలో తనపై వచ్చిన కథనాల గురించి సమగ్రంగా వివరించనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానం, తన నుంచి జగన్మోహన్ రెడ్డి బలవంతంగా లాక్కున్న వ్యాపారాల గురించి సమగ్రంగా వివరించనున్నారు. దీంతో అందరి దృష్టి ఆ ఇద్దరు నేతలపై పడింది. కచ్చితంగా ఏదో ఒక రాజకీయ సంచలనం నమోదు అనేది పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
* ఇటీవల చంద్రబాబుతో భేటీ..
ఏడాది కిందట జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబుకు వ్యతిరేక ముద్ర తో రాజకీయం నడిపారు బాలినేని. కానీ అదే చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇంతలోనే సాక్షి మీడియాలో బాలినేనికి వ్యతిరేకంగా పతాక స్థాయిలో కథనాలు వచ్చాయి. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి. సాక్షిలో తనపై వచ్చిన కథనాల పై పూర్తి స్పష్టత నిచ్చేందుకు.. అసలు తెర వెనుక ఏం జరిగింది.. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో తన చుట్టూ జరిగిన రాజకీయ కుట్రలు.. తన వ్యాపారాలను అడ్డగోలుగా బదలాయింపులు వంటి వాటిపై పూర్తి స్పష్టతనివ్వనున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. సంచలన ప్రకటనలు ఉంటాయని కూడా ప్రచారం జరుగుతోంది.
* సంచలనాల నమోదు.
జగన్మోహన్ రెడ్డి సైతం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అయితే అనుకూల జర్నలిస్టులను పిలిచి.. కొన్ని రకాల మైకులు పెట్టి.. రికార్డెడ్ వీడియోలను ఎడిటింగ్ చేసి.. ఈ వారం విడుదల చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ మీడియా సమావేశం అంటేనే సోషల్ మీడియా కు పండుగలా మారుతుంది. అందుకే ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు. కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం లైవ్ టెలికాస్ట్ లో మాట్లాడనున్నారు. జగన్మోహన్ రెడ్డి రికార్డ్ ప్రెస్ మీట్ వీడియోలు మీడియా చేతికి చిక్కి.. ప్రసారం కాకమునుపే బాలినేని లైవ్ టెలికాస్ట్ ప్రసార సంస్థ.. సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది..

