ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా ఆలస్యం: ‘హనుమాన్’ సినిమాతో దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ అప్పటినుంచి మరో సినిమా చేయలేదు. ఆ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు తను మరో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి అనే ధోరణిలో చాలామంది వల్ల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రశాంత్ వర్మ హనుమాన్ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల సినిమా డిలే అవుతుంది. కాబట్టి దానివల్ల లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఆయన ప్రభాస్ కి ఒక కథనైతే వినిపించాడనే వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన ఫుల్ నెరేషన్ అయితే ఈ మధ్యకాలంలో ఇచ్చారట. కానీ ప్రభాస్ తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే ప్రశాంత్ వర్మ బాలయ్య కొడుకుతో సినిమా చేస్తానని చెప్పి ఆ సినిమా అనౌన్స్ అయిన తర్వాత మూవీ నుంచి తప్పుకున్నాడు. కాబట్టి తన మీద తనకే నమ్మకం లేదు కాబట్టి అతనితో సినిమా అనౌన్స్ అయిన తర్వాత అది క్యాన్సల్ అయితే తనకు బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా మీద ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు.
మొత్తానికైతే ప్రశాంత్ వర్మ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయినదే చెప్పాలి. ఇక ఇప్పుడు మరోసారి తను తను ప్రూవ్ చేసుకుంటేనే తప్ప తనకు స్టార్ హీరోల డేట్స్ దొరకవనే చెప్పాలి. ప్రభాస్ ప్రశాంత్ వర్మ కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే తను కనీసం రెండు సక్సెసులనైన సాధించాల్సిన అవసరం ఉంది…
ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోవడానికి మరో సిక్స్ మంత్స్ టైమ్ పట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రభాస్ మిగిలిన సినిమా షూటింగ్ లలో పాల్గొనే అవకాశమైతే ఉంది…

