– ప్రకటన –
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక @99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు కేటాయించడం జరుగుతుందని, త్వరలో ప్రభుత్వం 2వ దశకంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం అవుతుందని తెలిపారు.
పింఛన్ దారుల జీవన ప్రామాణిక ప్రక్రియ కొనసాగుతుందని, నూతన పింఛన్ల కొరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పెద్దా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ ఫలాన్ని అర్హులైన ప్రతి పేద ప్రజలకు అందేలా సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు గ్రామాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉందని అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు దాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలే కాకుండా గ్రామాల అభివృద్ధి కోసం అనేక నిధులు కేటాయించడం జరుగుతుందని అన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేస్తున్నారు.
తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ గృహజ్యోతి పథకంలో అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల విద్యుత్ అందించడం జరుగుతుందని, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ వ్యాపార రంగాలలో రుణ సదుపాయం కల్పించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించి చౌక ధరల ఉత్పత్తుల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని, రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.
భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా రైతు భరోసా, రైతు బీమా పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం జరుగుతుందని, సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్‌తో పాటు రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలు గౌరవంగా జీవించడం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. వేసవిలో ప్రజలకు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుంది .విద్యా రంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని, ప్రాథమిక పాఠశాల ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉదయం అల్పాహారం పథకం త్వరలో ప్రారంభం అవుతుందని, పిల్లలకు పోషకాహార లోపాన్ని నియంత్రించేందుకు ఈ పథకం అమలు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నియోజకవర్గ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరీచేయడం జరిగింది.
ఈ పాఠశాలల ద్వారా మరింత మెరుగైన, మెరుగైన విద్యకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికి బీమా సదుపాయం కల్పించేలా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు.జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి జరుగుతుందని.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే సమస్య నిధులు మంజూరు చేయడం జరిగింది. బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులను నమోదయ్యేలా చూడాలన్నారు. గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మధ్యాహ్నం భోజన పథకంలో ఇంటర్మీడియట్ వరకు మంచి పౌష్టికాహారంతో భోజనం అందించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఈ ఓ శోభారాణి, గ్రంధాలయం చైర్మన్ అవేజ్ చిస్తీ, ఆలేరు, మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మహేందర్ , విమల వెంకటేష్,భువనగిరి, ఆలేరు, చైతన్య గుట్టపల్లి, శ్రీవాదిగిరి, బాలసతీమణి వాణి భరత్ గౌడ్, డి ఆర్ డి ఏ నాగిరెడ్డి, సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
– ప్రకటన –

