జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో దమనకాండ సృష్టించారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అన్ని వ్యవస్థలనూ సర్వనాశనం చేశారన్న మంత్రి అచ్చెన్నాయుడు జగన్ విధ్వంసాన్ని సరిచేసి.. ఆంధ్రప్రదేశ్‌ని గాడిలో పెట్టామని చెప్పారు. రాజారెడ్డి హత్య ఎందుకు జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలుసునని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
వివేకాహత్య ఎందుకు జరిగిందో…
అలాగే వివేకానందరెడ్డి హత్య వెనక, అందుకు గల కారణాలు కూడా అందరికీ తెలుస్తాయని అన్నారు. జగన్ విధ్వంస పాలన నుంచి బయట పడేయటానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారా? అని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కేంద్రం సహాయ సహకారాలతో అభివృద్ధి బాట పట్టమన్న అచ్చెన్న కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని అన్నారు.

