సంచలన దర్శకుడు గోపాల్ వర్మ (RGV) ఏం మాట్లాడినా అందులో ఒక వైబ్ ఉంటుంది. కాస్త క్రేజీనెస్ ఉంటుంది. లేటెస్ట్ గా గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్, దివంగత కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ చూసిన తర్వాత ఆర్జీవీ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన సుదీర్ఘమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
“ఐ హేట్ మైఖేల్ జాక్సన్” అంటూ వర్మ తనదైన శైలిలో రాసుకొచ్చారు. అయితే ఈ ద్వేషం కోపంతో వచ్చింది కాదు, అమితమైన ప్రేమ వల్ల పుట్టింది. 2009 జూన్ 25న జాక్సన్ మరణ వార్తను టీవీ స్క్రీన్‌పై చూసినప్పుడు తానూ పొందిన షాక్‌ను వర్మ గుర్తుచేసుకున్నారు. “నువ్వు చనిపోయి, నువ్వు కూడా మామూలు మనిషివే అని నిరూపించి నన్ను వెన్నుపోటు పొడిచావు. నా ఫాంటసీని ముక్కలు చేశావు. అందుకే నిన్ను ద్వేషిస్తున్నా” అంటూ క్రేజీగా తన బాధను వెళ్లగక్కారు.
విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో, 1984 జనవరిలో ఒక చిన్న వీడియో పార్లర్లో ‘థ్రిల్లర్’ ఆల్బమ్ చూడటమే తన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ మూమెంట్స్ చూసి మైఖేల్ జాక్సన్ మనిషి కాదని, ఏదో అలౌకిక శక్తి అని నమ్మారట. ‘బీట్ ఇట్’, ‘బిల్లీ జీన్’, ‘బాడ్’ వంటి ఐకానిక్ సాంగ్స్ తన సినిమాల్లోని పాటల పిక్చరైజేషన్‌కు బెంచ్‌మార్క్‌గా నిలిచాయని వర్మ అంగీకరించారు. ఆర్జీవీ క్లాసిక్స్ ‘శివ’, ‘సత్య’ సినిమాల్లో కొన్ని ఇంటెన్స్ మేకింగ్ షాట్స్‌లో ఆ జాక్సన్ ప్రభావం కనిపిస్తుందని సినిమా విశ్లేషకులు సైతం చెబుతుంటారు.
జాక్సన్ చుట్టూ ఉన్న వివాదాలు, స్కాండల్స్ తనకు కేవలం బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ మాత్రమేనని, అతను ఎప్పటికీ ‘గాడ్స్ స్పెషల్ క్రియేషన్’ అని వర్మ కొనియాడారు. చివరగా, “నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా.. విశ్వాంతరాల్లో మూన్‌వాక్ చేస్తూనే ఉంటావని నాకు తెలుసు” అంటూ ఆర్జీవీ ముగించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం వర్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కింగ్ ఆఫ్ పాప్ మాయాజాలాన్ని వర్మ కంటే క్రేజీగా ఎవరూ డీకోడ్ చేయలేరేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నేను మైఖేల్‌ను ద్వేషిస్తున్నాను
MICHAEL ఫిల్మ్ చూసిన తర్వాత, నా జ్ఞాపకం జూన్ 25, 2009 నాటి భయంకరమైన రోజుకి తిరిగి వెళ్లింది, నేను నా గదిలోని చీకటిలో టెలివిజన్ దెయ్యంలా గొణుగుతూ ఆలస్యంగా నిద్రపోయాను, మరియు ఉదయం నేను గజిబిజిగా మేల్కొన్నాను మరియు నా కళ్ళు స్క్రీన్‌పైకి వెళ్లాయి…
— రామ్ గోపాల్ వర్మ (@RGVzoomin) మే 22, 2026

