రేపు యాదగిరి గుట్టకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 9గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. ఉదయం 9:30 గంటలకు లక్ష్మీనరసింహ స్వామిని రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
వేదపాఠశాల నిర్మాణ…
ఉదయం పది గంటలకు వేద పాఠశాల భూమి పూజ చేయనున్నారు. కొండ మీద నిర్మించే పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రేవంత్ రెడ్డి యాదగిరి గుట్ట పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

