ట్రంప్‌కు ప్రాణహాని: ప్రపంచ దేశాల మీద టారిఫ్ లు విధించాడు. వెనిజుల నుంచి ఇరాన్ వరకు యుద్దాలు చేస్తూనే ఉన్నాడు. గిట్టని దేశాల మీద రకరకాల రూపాలలో ఒత్తిళ్లు తీసుకొస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం చేస్తాడో తెలియదు. అటువంటి ట్రంప్ భయపడుతున్నాడు. ప్రాణభయంతో దాక్కుంటున్నాడు. కట్టుదిట్టమైన భద్రత ఉంటే ట్రంప్ ఇలా భయపడండి.. అన్నింటికీ మించి తనకు ప్రాణభయం ఉందని చెప్పడం మరింత ఆశ్చర్యం.
పెద్ద ట్రంప్కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పెళ్లి త్వరలో జరగనుంది. ఈ వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ వివాహానికి తాను హాజరు కాకపోవచ్చని ట్రంప్ బాంబు పేల్చారు. ఒకవేళ ఆ పెళ్లికి తాను హాజరైతే సత్యదూరమైన వార్తలతో తనను వేధిస్తారని, అవసరమైతే చంపేస్తారని ట్రంప్. ఎవరైనా వివాహానికి హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ అన్నారు. అయితే ట్రంప్ హాజరుకావడం అంత ఈజీ కాకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా అధికారులుచివరి వరకు గోప్యత పాటించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ట్రంప్ మీడియాను కూడా పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, అనేక పరిణామాల నేపథ్యంలో ట్రంప్ పెళ్లికి హాజరు కావడం ఒకరకంగా సవాల్ గా మారే అవకాశం ఉంది. పెద్ద ట్రంప్ కుమారుడికి 48 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అతడికి ఈ వీకెండ్ లో తన ప్రియురాలు బెట్టినాతో వివాహం జరగనుంది. బహమాస్ లో ఈ వివాహం జరుగుతుంది.కేవలం సన్నిహితులకు మాత్రమే వివాహానికి ఆహ్వానం లభించింది. పెద్దకుమారుడికి 2005లో వెనెసాతో వివాహం జరిగింది. 2018లో వీరిద్దరూ విడిపోయారు. వీరు ఏకంగా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. 2020లో ఫ్యాక్స్ న్యూస్ లో ప్రజెంటర్ గా పని చేసే కింబర్లీతో ట్రంప్ జూనియర్ కు నిశ్చితార్థం జరిగింది. కారణాలు తెలియవు గాని.. అది పెళ్లి వరకు వెళ్లలేదు. ప్రస్తుతం ట్రంప్ జూనియర్ మోడల్ బెట్టినాతో రిలేషన్ లో ఉన్నాడు. గత ఏడాది బెట్టినాతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.

