మన తెలంగాణ/సిటీబ్యూరో: అడ్డగోలుగా ఆస్తులు సంపాదించిన ఓ డిప్యూటీ కలెక్టర్ ఇళ్లపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఏకకాలంలో 11 చోట్ల తనిఖీలు నిర్వహించగా, రూ.150 కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు సీజ్ చేసి అరెస్టు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో యూఎల్సిలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా మర్రి వంశీమోహన్ పనిచేస్తున్నాడు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగినట్లు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు వంశీమోహన్ కార్యాలయం, ఇళ్లు, బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడు లు చేశారు. దాడుల్లో ఏసీబీ అధికారులు కళ్లు చెదిరే ఆస్తుల రేకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. రూ.4,46,28,000 విలువైన 19 ఓపెన్ ప్లాట్లు, వనస్థలిపురం, ఎన్జీఓస్ కాలనీలో ఇండిపెండెంట్ ఇల్లు, మణికొండ, మజీద్‌బండలో 2 ఫ్లాట్లు, వాటి విలువ రూ.1,12,00,000, ఇబ్రహీపట్నం, నారపల్లిలోని తరువాయి 9లో
మొదటి పేజీ తరువాయి
రెండు ఎకరాల్లో ఫామ్‌హౌజ్‌లు,
ఇంట్లో రూ.2,10,800 నగదు, బ్యాంక్‌లో రూ.20 లక్షల డిపాజిట్, 122 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.32 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా, కియా కార్‌ను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్, పిగిలిపూర్ గ్రామంలో సర్వేనంబర్ 17 ఎనిమిది ఎకరాల భూమిని 2023లో తన మామ విజయ్‌భాస్కర్ పేరుతో కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆస్తుల విలువ రూ.6,22,38,800 ఉంటుందని తెలుస్తుంది. డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ మోహన్ బహిరంగ మార్కెట్లో రూ.150 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. వంశీని అరెస్టు చేసిన ఏసీబీమోహన్ అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు.
యూఎల్‌సీలో ఫైళ్లు మిస్సింగ్..
ఇటీవల కాలంలో యూఎల్సిలో ఫైల్స్ మిస్సవడం, మార్చడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి, ఇక్కడే వంశీమోహన్ పనిచేస్తున్నారు. శేరిలింగంపల్లితోపాటు పలు ప్రాంతాల్లో తహశీల్దార్‌గా పనిచేసిన వంశీమోహన్ ప్రభుత్వ భూములను భారీగా అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్, పిగ్లీపురం ప్రాంతాల్లో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని వంశీమోహన్ కాజేసి ఈ భూములను తన మామ పేరు మీద స్వాధీనం చేసుకున్నాడు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గిఫ్ట్ డీడ్ చేసి దానికి బదులుగా తను పది ప్లాట్లు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

