కల్కి 2 సినిమా బడ్జెట్: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ‘కల్కి’ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కల్కి 2’ సినిమా కూడా రాబోతుంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. మొత్తానిక ‘కల్కి 2’ సినిమా షూటింగ్ కి సంబంధించిన సెట్స్ అయితే రెడీ చేసి పెట్టారట. ప్రభాస్ ఎప్పుడు వస్తే సినిమా షూటింగ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. కల్కి మూవీతో 1100 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. కాబట్టి ‘కల్కి 2’ సినిమా మీద బడ్జెట్ కూడా భారీగానే కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా మీద దాదాపు 800 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద భారీ హైప్ ఉండటం వల్ల ఈ సినిమా చూడడానికి ప్రతి ప్రేక్షకుడి ఇంట్రెస్ట్ చూపిస్తాడు.
అందుకే వాళ్ల హైప్ ని క్యాష్ ఈ సినిమాని విజువల్ వండర్ గా చూపించాలనే ఉద్దేశ్యంతో నాగ్ అశ్విన్ ఉన్నాడు… తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే ‘నాగ్ అశ్విన్’ పాన్ వరల్డ్ లోనే ఒక మంచి దర్శకుడిగా మారిపోతాడు. ఇక ఈ సినిమా బడ్జెట్ చూసిన కొంతమంది ‘కల్కి 2’ సినిమా బడ్జెట్ తో దాదాపు 100 సినిమాలు చేయొచ్చు కొన్ని కామెంట్లు.
నిజానికి 5,6 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమాలు ఈ మధ్యకాలంలో మంచి విజయాలను సాధిస్తున్నాయి. ముఖ్యంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో చేశారు. ఇక ‘కల్కి 2’ సినిమా మీద పెట్టే బడ్జెట్ తో అలాంటివి ఒక 100 సినిమాలు చేయొచ్చు కొంతమంది సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్ ను ఉద్దేశించి ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు…
ఇక మరి కొంతమంది మాత్రం ఏ సినిమా రేంజ్ ఆ సినిమాదే విజువల్ వండర్స్ ను క్రియేట్ చేస్తే మన ఇండస్ట్రీ హాలీవుడ్ ఇండస్ట్రీకి సరి సమానంగా మారుతుంది. లేకపోతే మనం ఎన్ని సినిమాలు చేసిన సక్సెస్ ఫెయిల్యూర్స్ మాత్రమే తప్ప ఇండియన్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా స్థాయి పెరగడం వల్ల కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది…

