- తెలంగాణ శాఖలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు
- స్టేషన్ ఘన్పూర్, పరకాల ఆర్డీఓ పోస్టుల్లో కీలక మార్పులు
- డెప్యుటేషన్‌పై అధికారులకు కొత్త బాధ్యతలు
- తక్షణమే అమల్లోకి వచ్చిన ప్రభుత్వ తాజా ఉత్తర్వులు
తెలంగాణ బదిలీలు : తెలంగాణ తాజా డిపార్ట్మెంట్లో భారీ బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ (పరిపాలనా సంబంధిత కారణాలు) పై ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ (బదిలీలు మరియు పోస్టింగ్‌లు) శనివారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్ డి.ఎస్. జీవో (GORt.No.286) విడుదల చేశారు. ఈ లేటెస్ట్ ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయిన అధికారులు, వారి కొత్త పోస్టింగ్ వివరాలు కింద ఉన్న పారాగ్రాఫ్ లో చూడవచ్చు.
కరీంనగర్ ఎస్డీసీ (SDC, LA) గా పనిచేస్తున్న ఎస్. కిరణ్ ప్రకాష్‌ను స్టేషన్ ఘన్పూర్ ఆర్డీఓ (RDO) గా బదిలీ చేశారు. అలాగే ఘన్పూర్ ఆర్డీఓగా పోస్టింగ్ ఆర్డర్లలో ఉన్న ఆర్.వి. రాధా బాయిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (MA&UD) డిపార్ట్మెంట్కు బదిలీ చేస్తూ.. అక్కడ నుండి కుడా (KUDA) ఎస్డీసీగా వన్ ఇయర్ పీరియడ్ కోసం డెప్యుటేషన్‌పై నియమించారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్పూర్ ఆర్డీఓగా ఉన్న డి.ఎస్. వెంకన్నను పరకాల ఆర్డీఓగా, డాక్టర్ పిఆర్హెచ్ఆర్డీ ఐటీ (Dr.MCRHRD IT) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా డెప్యుటేషన్‌పై ఉన్న ఎన్. నిర్మలను ములుగు ఆర్డీఓగా బదిలీ చేశారు. వీటితో పాటు ములుగు ఆర్డీఓగా పనిచేస్తున్న ఎన్. వెంకటేష్‌ను హనుమకొండ ఆర్డీఓగా ట్రాన్స్ఫర్ చేయగా.. పరకాల ఆర్డీఓగా ఉన్న కె. నారాయణను తదుపరి పోస్టింగ్ కోసం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయవలసి ఉంది. ఈ బదిలీలన్నీ తక్షణమే అమల్లోకి వస్తుందని గవర్నమెంట్ స్పష్టం చేసింది.

