పలు బ్లాక్బస్టర్ చిత్రాలను నిర్మించి ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు చేస్తున్నారు అగ్ర నిర్మాత ఎంఎస్ రాజు. అయితే ఎంఎస్ రాజు నిర్మాణంలో సిద్ధార్థ్-, త్రిష కాంబినేషన్లో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత అదే బ్యానర్లో సిద్ధార్థ్ హీరోగా ‘ఆట’ సినిమా ప్రకటించినప్పుడు అందులో హీరోయిన్గా తనను తీసుకోలేదని త్రిష తీవ్రంగా అలిగిందట.
ఆ సినిమా కోసం త్రిష… ఎంఎస్ రాజుకు ఫోన్ల మీద ఫోన్లు చేసి.. తానే స్వయంగా షూటింగ్కు వస్తున్నానని కూడా చెప్పిందట. కానీ ఇప్పటికే ఆ పాత్ర కోసం ఇలియానాను ఎంపిక చేసి షూటింగ్ కూడా ప్రారంభించామని నచ్చజెప్పిన తర్వాతే త్రిష తన ప్రయాణాన్ని ఆపుకుందని ఎంఎస్ రాజు తాజాగా ఓ ఇంటర్వూలో పేర్కొన్నారు.

