తెలంగాణ:మహబూబాబాద్ జిల్లాలో వరుసగా జరుగుతున్నది కాపర్ వైర్ చోరీలకు (కాపర్ వైర్ దొంగతనాలు)కురవి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు కేసు వివరాలను గుర్తించారు.
జిల్లాలో సంచలనం సృష్టించిన కాపర్ వైర్ చోరీ కేసులను ఛేదించిన పోలీసులు ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేశారు.సీసీఎస్(CCS) మరియు కురవి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు,వారి వద్ద నుండి భారీ మొత్తంలో కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 11 చోరీ కేసులను నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు.
చోరీ చేసిన కాపర్ వైర్‌ను అమ్మకానికి తీసుకెళ్తుండగా నేరడ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారని.సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు,ప్రత్యేక నిఘా ద్వారా నిందితుల కదలికలను గుర్తించి ముఠాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసుతో జిల్లాలో నమోదైన పలు కాపర్ వైర్ చోరీ కేసులకు తెరపడినట్లు గుర్తించారు.కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని డీఎస్పీ అభినందించారు.
ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.


