హైదరాబాద్: చిన్న వయసులోనే ఆ చిన్నారి చాటిన మానవత్వం ప్రతి ఒక్కరి చేత హ్యాట్సాఫ్ చెబుతోంది. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ, కీమో థెరపీ చికిత్స కారణంగా జుట్టు కోల్పోయి మానసిక వేదన అనుభవించే వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక మంచి నిర్ణయం తీసుకుంది. తనకెంతో ఇష్టమైన పొడవాటి జుట్టును క్యాన్సర్ బాధితుల విగ్గుల తయారీ కోసం దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. చిన్న వయసులో ఇతరుల గురించి ఆలోచించడం అంత చిన్న విషయం కాదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
అమ్మతో డిస్కషన్.. క్షణాల్లో బిగ్ డెసిషన్..
హైదరాబాద్‌లోని నాగోల్, అల్కాపురి చేరిన ఈ చిన్నారి పేరు ఆద్య. ప్రస్తుతం స్థానికంగా ఉన్న పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తన జట్టు కొంచెం చిన్నగా కట్ చేసి పోనీటైల్ హెయిర్ స్టైల్‌గా మార్చాలని తల్లిని కోరింది. అయితే అంతకంటే చిన్నగా కట్ చేయుకో ఈ జట్టును క్యాన్సర్ పేషెంట్లకు ఇద్దామని చెప్పారు. కొంచెం జట్టు ఇస్తే వారికి ఏం సరిపోతుంది, గుండు చేయించుకుని మొత్తం జుట్టు వారికి డొనెట్ చేస్తానంటూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు: పేదవారికి గుడ్‌న్యూస్ 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
క్యాన్సర్ బాధితుల కష్టాలను, జుట్టు లేకపోవడం వల్ల వారు అనుభవించే న్యూనతాభావాన్ని చూసి ఈ బాలిక మనసు చలించిపోయింది. దీంతో ఎలాగైనా వారిలో ఒక్కరికైనా తన వంతు సహాయం చేయాలనుకుని, ఒక స్వచ్ఛంద సంస్థ (NGO) ద్వారా తన జుట్టును క్యాన్సర్ బాధితుల కోసం అందజేసి పెద్ద మనసు చాటుకుంది. తల్లి చెప్పిన ఒక్క మాటతో గొప్ప నిర్ణయం తీసుకుని నిమిషాల్లో గుండు చేయించుకుని, జుట్టు మొత్తం డొనెట్ చేసి ఈ చిట్టితల్లి ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
వారి ముఖాల్లో నవ్వు నాకు మరెంతో ఆనందం.. బాలిక ఆద్య
నా జుట్టు కత్తిరించుకుంటున్నందుకు ఏ బాధ లేదు.. నా వల్ల క్యాన్సర్ బాధితుల ముఖాల్లో నవ్వు కనిపిస్తుందనే ఆనందమే ఎక్కువగా ఉందంటూ బాలిక ఆద్య చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఇంత చిన్న వయసులోనే సమాజం పట్ల బాధ్యతను, తోటి వారి సమస్యను పరిష్కరించేందుకు తన వంతుగా చూపించిన చొరవతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా జడ, జట్టు అంటే అమ్మాయిలకు ఇష్టం కాదు, ప్రాణం అని చెప్పాలి. అయితే చిన్నారి ఆద్య క్యాన్సర్ పేషెంట్‌కు విగ్గు కోసం మొత్తం వెంట్రుకలు ఇవ్వడం మరెంతో మందికి స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: ఫ్యాటీ లివర్ : ఫ్యాటీ లివర్ మందు(ఆల్కహాల్) వల్ల మాత్రమే కాదు.. మైదా, మటన్ వంటి వాటి వల్ల కూడా కాలేయానికి నష్టమే
ఇంకా చదవండి

