హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పంటమార్పిడి చేయాలంటే మక్కజొన్న పంటను రైతులు అధికంగా పండించారని, రైతులు పండించిన మక్కజొన్న పంటను సేకరించడం లేదని జీవన్ రెడ్డి. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, రూ.21వేల కోట్లు సిద్ధం చేసి పెట్టామని రేవంత్ చెప్పారని తెలియజేశారు. రేవంత్ రెడ్డి 75 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం సేకరణ కుదించారని, వాస్తవంగా ప్రభుత్వం 40 లక్షల టన్నులు కూడా సేకరించలేదని, 50 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోయి ఉన్నాయని, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఏమైంది? అని ప్రశ్నించారు. వడదెబ్బ, గెండెపోటుతో రైతులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల మరణాలకు సిఎం రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని, అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.

