Published on: 7:10 pm, 24 మే 2026
ఆధునిక కాలంలో వివాహేతర బంధాలు అంతంతకూ పెరుగుతున్నాయి. తన జీవితంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిందో మహిళ. ఆపై తన చేతులతోనే చంపేసిన భర్తను పాతిపెట్టేందుకు ఆమె ఏకంగా జేసీబీతోనే గొయ్యి తీసింది. ఆపై భర్త శవాన్ని ఆ గోతిలో పాతిపెట్టి… భర్త కనిపించడం లేదని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా ఈ ఘాతుకానికి కారణమైనట్లు పోలీసులు తేల్చారు. ఇదెక్కడో జరిగిన ఘటన కాదు. మన తెలుగు నేలలో జరిగిన దారుణ ఘటన.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలో సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎల్గోయి మండలం గంగాపూర్లో జరిగిన ఈ ఘటనపై నారాయణ్ ఖేడ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే… గంగాపూర్ కు చెందిన ముత్యం రెడ్డి దంపతుల మధ్యలోకి చింటూ అనే వ్యక్తి చేరిపోయాడు. ముత్యంరెడ్డి సతీమణి అతడితో వివాహేతర బంధాన్ని ప్రారంభించింది. అయితే తమ వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భావించి ముత్యంరెడ్డిని హత్య చేసేందుకు ఆమె సిద్ధపడింది.
అదే తడవుగా… ఈ పరిశీలించి ప్రియుడు చింటుతో పంచుకున్న ఆమె తన భర్తను చంపేందుకు చింటూనూ సిద్ధం చేసింది. ఇంకేముంది… తనకు అనుకూలమైన సమయంలో భర్తను ప్రియుడితో కలిసి ఆమె చంపేసింది. మరి చంపేసిన శవాన్ని ఇంటిలో పెట్టుకోలేరు కదా. శవాన్ని పాతిపెట్టేందుకు తీయాల్సిన గొయ్యి కోసం ఆమె ఏకంగా జేసీబీనే ఆశ్రయించిందట. జేసీబీతో తీసిన గోతిలో ప్రియుడితో కలిసి భర్త శవాన్ని పాతిపెట్టేసింది.
ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నారాయణ్ ఖేడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆ మహిళ… తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ముత్యంరెడ్డి కోసం వెతుకులాట కోసం. ఈ విధంగానే ఆ మహిళపై అనుమానం వచ్చిన పోలీసులు… ఆమెను తమదైన శైలిలో విచారించారు. పోలీసు దెబ్బ పడగానే నిజాన్ని వెళ్లగక్కిన నిందితులు జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి… ఆ శవాన్ని పాతిపెట్టేందుకు ఏకంగా జేసీబీతోనే గొయ్యి తీసిన ఆ మహిళను చూసి పోలీసులే షాక్ తిన్నారట.

