Realme 16T 5G: మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా కోరుకునే మొబైల్స్ కంపెనీల్లో Realme ఒకటి. ఈ కంపెనీ నుంచి వచ్చే మొబైల్స్ బడ్జెట్ లోనూ.. ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇతర అప్డేట్ వెర్షన్ తో మార్కెట్లోకి వస్తాయి. ఇందులో భాగంగా లేటెస్ట్ గా రియల్ మీ 16T 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో బలమైన బ్యాటరీతో పాటు విజులవల్స్ కు అనుగుణంగా డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
రియల్ మీ 16T 5G ఫోన్లో 6.8 అంగళాల LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 144Hz రిష్రెష్ రేట్ తో పనిచేస్తుంది. రోజువారీ వినియోగంలో స్క్రోలింగ్, వీడియో ప్లేబ్యాక్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉండేలా దీనిని రూపొందించారు. పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో MediaTek Dimensity 6300 చిప్ సెట్ ను ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో 6GB లేదా 8GB RAM, 128GB లేదా 256GB నిల్వ వరకు వినియోగించుకోవచ్చు. Android 16 ఆధారిత Realme UI 7పై ఈ కొత్త మొబైల్ పనిచేస్తుంది.
ఫోటోగ్రఫీ కోరుకునేవారికి ఈ ఫోన్లో రియర్‌లో 50MP ప్రధాన కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. వీటితో పాటు AI పోర్ట్రెయిట్ గ్లో, AI ఇన్స్టంట్ క్లిప్ వంటి సాఫ్ట్వేర్ ఫీచర్లు కూడా ఫోన్లో ఉన్నాయి.
Realme 16T ప్రధానంగా బ్యాటరీ ప్రేమికుల కోసం రూపొందించిన ఫోన్. ఇందులో 8,000mAh బ్యాటరీ ఉండటంతో దీర్ఘకాలిక బ్యాకప్ లభిస్తుంది. ఈ బ్యాటరీకి 45W ఛార్జింగ్ తో పాటు బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఇక ఇందులో IP69 రేటింగ్ ఉండటంతో దుమ్ము, ధూళి తో పాటు నీటి బిందువుల నుంచి రక్షణగా ఉంటుంది. అలాగే ఇందులో కూలింగ్ సిస్టమ్ కూడా బాగానే ఇచ్చారు. మొత్తం మీద, దీన్ని బ్యాటరీ, డిస్ప్లే, కఠినమైన బాడీ, మధ్యస్థాయి పర్ఫార్మెన్స్ కలిపిన ప్యాకేజ్‌గా చూడొచ్చు.
ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. రూ. 29,999 నాంచి ప్రారంభమై రూ. 31,999 వరకు విక్రయిస్తున్నార. ఇది Flipkart, Realme India వెబ్సైట్లలో అందుబాటులో ఉంది.

