- ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చింది.
- ఆధునిక లేబర్ అడ్డాల ఏర్పాటుతో ఉపాధి కల్పన మెరుగుపరిచింది.
- నిలిచిపోయిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించి, అండగా నిలిచింది.
- పారిశ్రామిక భద్రత, ఈఎస్ఐ వైద్య సేవలను మెరుగుపరిచింది.
ఆంధ్ర ప్రదేశ్ తాజా వార్తలు | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణంలో వెన్నెముకలుగా నిలిచే సంఘం, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో విప్లవాత్మక అడుగులు వేసింది. కుదేలైన నిర్మాణ రంగాన్ని, కార్మిక వ్యవస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన దర్శనికతతో పునరుద్ధరించారు. కార్మికులకు నైపుణ్య శిక్షణ (స్కిల్ అప్‌గ్రేడ్) ఇప్పుడు వారితో పాటు, సమాజంలో వారి గౌరవాన్ని పెంచేలా లేబర్ అడ్డాల నిర్మాణం, వైద్య సంరక్షణ కోసం సరికొత్త ఈఎస్ఐ ఆసుపత్రుల ఏర్పాటు వంటి చర్యలతో కూటమి ప్రభుత్వం కార్మికులకు కొండంత అండగా నిలిచింది.
మౌలిక వసతులతో ‘లేబర్ అడ్డాల’ ఏర్పాటు
ఉపాధి కోసం కూడళ్లలో ఎండనక, వాననక నిలబడే దినసరి కూలీల కష్టాలకు పరిష్కారంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు వంటి నగరాలతో పాటు ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఆధునిక లేబర్ అమెనిటీస్ సెంటర్లు (లేబర్ అడ్డాల) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ కేంద్రాల ద్వారా కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లతో పాటు ఉద్యోగ సమాచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు అందజేస్తారు. పని లేని సమయాల్లో కార్మికులతో పాటు టెక్నాలజీని జోడించి నైపుణ్యం శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు.
నిలిచిన సంక్షేమ పథకాలకు పునరుజ్జీవం
రాష్ట్రంలో 88 లక్షల మంది అసంఘటిత కార్మికులు, అందులో 18 లక్షల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ధీమా కల్పిస్తూ గతంలో నిలిచిపోయిన పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం కార్మిక కుటుంబాలకు ప్రసూతి సహాయం కింద రూ. 20 వేలు, వివాహ కానుకగా రూ. 40 వేలు, సహజ లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించే రూ. 20 వేల తక్షణ సహాయంతో పాటు అంత్యక్రియల ఖర్చుల కోసం రూ. 60 వేలు అందిస్తూ ఉచిత వైద్య పరీక్షలు చేశారు.
పారిశ్రామిక భద్రతకు పెద్ద పీట
పారదర్శకత, సూత్రాలతో ఫ్యాక్టరీల శాఖకు భద్రత కల్పించిన ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించిన 23 ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకున్నారు. కార్మికుల ప్రాణ రక్షణ కోసం సేఫ్టీ అలర్ట్, సిసిడెంట్ అలర్ట్ వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జేఎన్టీయూ, ఎస్వీయూ వంటి ప్రతిష్టాత్మక యూనివర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, 360 పరిశ్రమల్లో థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్లు, వందలాది మాక్ డ్రిల్స్ నిర్వహించడం పారిశ్రామికంగా భద్రతలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది.
Also Read: Amaravati News: అమరావతిలో తొలిదశ భూసేకరణ వేగవంతం.. విడివిడిగా CRDA నోటిఫికేషన్లు – రైతులకు మరో ఛాన్స్ !
ఈఎస్ఐ వైద్య సేవల్లో చరిత్రాత్మక మార్పులు
రాష్ట్రంలోని 15 లక్షల మంది ఇన్సూర్డ్ పర్సన్స్ ఆరోగ్య రక్షణే ధ్యేయంగా భీమా వైద్య సేవ శాఖను ప్రభుత్వం ఆధునీకరించింది. అచ్యుతాపురంలో ఈఎస్ఐ ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు తిరుపతి, గుంటూరు, కర్నూలు, శ్రీసిటీ, నెల్లూరు ప్రాంతాల్లో ఆసుపత్రుల విస్తరణకు భూములు కేటాయించారు. విశాఖపట్నంలో ESIC మెడికల్ కాలేజీ, అమరావతిలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మై హెల్త్, ఇ-ఔషధి వంటి మొబైల్ యాప్‌ల ద్వారా మందుల పంపిణీలో పూర్తి పారదర్శకతను తీసుకువస్తూ కార్మికుల ప్రాణాలకు, ఆరోగ్యానికి ఢోకా లేకుండా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా సాగించింది.
ఇది కూడా చదవండి: ప్రకాష్ రాజ్: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ఇంకా చదవండి

