తెలంగాణ:సూర్యాపేట జిల్లా ఎల్కారం గ్రామంలో జరిగిన హత్య ఘటన కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ మాజీ మంత్రి,ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి )చేసిన వ్యాఖ్యలను డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ( గుడిపాటి నర్సయ్య )తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హత్య రాజకీయాలను ప్రోత్సహించదని స్పష్టం చేశారు.
పోలీసుల విచారణ జరుగుతున్న సమయంలోనే జగదీశ్‌రెడ్డి స్వయంగా విచారణ అధికారిలా మాట్లాడటం బాధ్యతారాహిత్యంగా ఉన్నట్లు గుర్తించారు.
ఎల్కారం గ్రామంలో పాత కక్షల కారణంగా జరిగిందా లేదా వ్యక్తిగత విభేదాల వల్ల జరిగిందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.కానీ,పూర్తి వివరాలు వెలుగులోకి రాకముందే కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం రాజకీయాల కోసమేనని ఆరోపించారు.
ఈ హత్య ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

