చాలా గ్యాప్ తీసుకుని సమంత చేసిన సినిమా మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు సామ్ భర్త రాజ్ నిడిమోరు ప్రొడక్షన్ పనులు చూసుకున్నారు. నిజానికి ఇది మే 14 రిలీజ్ కావాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు తగినంత సమయం లేకపోవడంతో జూన్ 19కి వెళ్లిపోయారు. దానికన్నా ముందు జూన్ 4 ఆప్షన్ అనుకున్నారు కానీ ఉన్నట్టుండి పెద్ది ఆ డేట్ లాక్ చేసుకోవడంతో వేరే మార్గం లేక వాయిదా వేశారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ మా ఇంటి బంగారానికి గండం అయిపోలేదు. కొత్తది వచ్చేలా ఉంది. విజయ్ జననాయకుడికి సెన్సార్ నుంచి రూట్ క్లియర్ అయినట్టుగా చెన్నై సమాచారం. నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ జూన్ 19న విడుదలకు ఛాన్స్ ఉందని కోలీవుడ్ బయ్యర్లకు ప్రాథమికంగా చెప్పేశారని వినికిడి. అంటే సరిగ్గా మా ఇంటి బంగారం వచ్చే రోజన్న మాట. తెలుగులో ఇబ్బంది లేదు కానీ తమిళ వెర్షన్ కు పెద్ద కాంపిటేషన్ అవుతుంది.
అసలే వారం తర్వాత మే 29 అఖిల్ లెనిన్ ఉంది. కాబట్టి మరోసారి వాయిదా వేసుకోవాలంటే స్క్రీన్ పరంగా సమస్య తప్పదు. జన నాయకుడు ఇచ్చిన కట్స్ పోను వెర్షన్ సంతృప్తికరంగా వచ్చిందని యూనిట్ ఫైనల్‌లు అంటున్నాయి. తమిళనాడు సీఎం విజయ్ తో మాట్లాడి అప్పుడు నిర్ణయం వెల్లడిస్తారని అంటున్నారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు తన చివరి సినిమాగా విజయ్ జన నాయకుడిని ప్రకటించడంతో అంచనాలు మాములుగా లేవు.
భగవంత్ కేసరి రీమేక్ కాబట్టి మన దగ్గర విజయ్ మూవీ అద్భుతం చేసే అవకాశం లేదు కానీ ఒకవేళ మా ఇంటి బంగారాన్ని కనక మలయాళ వెర్షన్ రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం విజయ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఇబ్బందవుతుంది. జానర్ పరంగా చూసుకుంటే వాటికి పోలిక లేదు కాబట్టి రిస్క్ చేయొచ్చు కానీ ఎటొచ్చి సరిపడా థియేటర్లు దొరకడం కష్టమవుతుంది. ట్రైలర్ లాంచ్ కు రెడీ అవుతున్న మా ఇంటి బంగారంలో అసలేముందో బయటపడేది దాంట్లోనే.

