డాక్టర్ బిన్సీ ఫిష్ స్కేల్ ప్రయోగం: మార్కెట్లో మనం చేపల కొంటాం. ఇంటికి తీసుకొచ్చి పొలుసులను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత కడిగి పండుకుంటాం. నచ్చినట్టు చింతపులుసు పోసుకొని.. కారం ఉప్పు దండిగా వేసుకొని హాయిగా తింటాం. కానీ ఎప్పుడు కూడా చేప పొలుసుల గురించి మనం ఆలోచించండి.
మనలో చాలామందికి పొలుసులంటే వ్యర్థ పదార్థమని ఒక బలమైన నమ్మకం. పైగా వాటితో కూర కూడా వండుకోవడం సాధ్యం కాదు. అందువల్లే వాటిని వృధాగా పడేస్తూ ఉంటాం. అయితే వీటి మీద ఓ మహిళ ప్రయోగాలు చేసింది. దుర్వాసన వచ్చినా సరే వెనకడుగు వేయలేదు. ఆమె ప్రయోగం ఫలించింది. చివరికి వైద్య రంగానికి కీలకమైన పదార్థాలను అందించే దిశగా ఆమె అడుగులు వేసింది. ఇది కాస్త శాస్త్ర సాంకేతిక రంగంలో సరికొత్త మార్పుగా అవతరించింది.
ఆమె పేరు డాక్టర్ బిన్సీ. హైదరాబాద్ నగరంలో ఉన్న సిఐఎఫ్టీ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ) సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈమెకు మొదటి నుంచి కూడా విభిన్నమైన ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం.. పైగా మనుషులను వేధిస్తున్న ఎముకల రుగ్మతలు.. దంతాల రుగ్మత ఆమెను నిత్యం ఆలోచనలో పడేసేవి. అందువల్ల చేప పొలుసుల మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది.
పొలుసుల ద్వారా ఎముకలు, దంతాల రుగ్మతలను తగ్గించే నానో ఫైబర్ ఆధారిత గ్రాఫ్ట్ పదార్థాన్ని బిన్సి తయారుచేసింది. చేపలు, ఇతర జలచరాల వ్యర్ధాల నుంచి హైడ్రాక్సి అపాయిట్, కొలాజన్ వంటి విలువైన పదార్థాలను కూడా అభివృద్ధి చేసింది. ఈ విధానాలు భారతదేశానికి ఫిషరీస్ విభాగంలో సరికొత్త ఆదాయాన్ని తెచ్చే విధంగా మారతాయని బిన్సీ చెబుతున్నారు.
చేపల పొలుసులను ఎలక్ట్రో స్పిన్నింగ్ ప్రక్రియ ద్వారా వైద్య ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.. ఈ విధానంలో చేపల పొలుసులను ముందుగా సన్నటి ఫైబర్లుగా మార్చేస్తుంటారు. ఆ తర్వాత ఒక సీట్ మీదకి తెస్తారు. అనంతరం వాటిని నానో ఫైబర్ గ్రాఫ్ట్ పదార్థాలుగా మారుస్తారు. వీటివల్ల గాయాలు నయమవుతాయి. ముఖ్యంగా వెరీ నాలను అతికించడానికి తోడ్పడతాయి.
రొయ్యలు, పీతలు వంటి వాటి మీద పెంకుల్లో కైటిన్ అనే పదార్థం ఉంటుంది. వాటి నుంచి బయోడిగ్రేబుల్ కైతోసాన్ అనే పదార్థాన్ని తయారుచేస్తారు. ఇది యాంటీ మైక్రోబియన్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల బయో మెడికల్.. ఫుడ్ ప్యాకేజింగ్ లో ఉపయోగించవచ్చు. అంతేకాదు మెరైన్ పరిధిలో నుంచి వచ్చే వ్యర్ధాల ద్వారా క్వాలిటీ ఉన్న కైటోసాన్ ను సిఐఎఫ్టీలో ఉత్పత్తి చేస్తున్నారు. ఫిషరీస్ ఉత్పత్తి విపరీతంగా కోలాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది వైద్య అవసరాలకు విపరీతంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు గాయాలను మాన్పడానికి సహకరిస్తుంది. సరికొత్త సాంకేతికతతో గాయాలను మాన్పించే ఉత్పత్తులను తయారు చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు స్క్విడ్ అనే సముద్ర జీ మీద ఇటీవల ప్రయోగాలు చేశారు. దీని ఇంక్ భాగంలో అత్యధికంగా మెలనిన్ ఉంటుంది. దీన్ని ప్రాసెస్ చేసి మనుషుల్లో తలెత్తే అనేక రకాల రుగ్మతలకు మందుగా వాడేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.

