– ప్రకటన –
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బృందం
– సామినేని రామారావు సతీమణి సామినేని స్వరాజ్యం
– సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – బోనకల్ : ఖమ్మం జిల్లా మధిర పరిధిలోని చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావుని హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(ఎం) రాష్ట్ర బృందం సోమవారం ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కి ముఖ్యమంత్రి సోమవారం కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సానుకూలంగా స్పందించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జగ్గుల జాన్ వెస్లీ ఆధ్వర్యంలో రాష్ట్ర బృందం, జిల్లా నాయకత్వం, సామినేని రామారావు సతీమణి సామినేని స్వరాజ్యం ఈ వినతి పత్రం. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సామినేని రామారావు పాతర్లపాడు గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కాండ్ర పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, మరికొంతమంది గుర్తి తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి అక్టోబర్ 31 2025 అత్యంత దారుణంగా హత్యకు గురైనట్లు ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. సామినేని రామారావు బతికి ఉంటే పాతర్లపాడులో సీపీఐ(ఎం)ను ఓడించడం సాధ్యం కాదని, రాజకీయ కక్షతో ఆ గ్రామానికి చెందిన వారు కుట్రపన్నీ అత్యంత కిరాతకంగా హత్య చేశారని వివరించారు. రామారావు హత్య జరిగి నేటికీ ఏడు నెలలు అవుతుందని చెబుతున్నారు. తన భర్తను హత్య చేసిన వారిని స్వయంగా చూసి వారి పేర్లు కూడా చెప్పి చింతకాని పోలీస్ స్టేషన్ లో సామినేని రామారావు భార్య స్వరాజ్యం పిటిషన్ ఇచ్చారని తెలిపారు. కానీ నేటి పోలీసుల సామినేని రామారావు హత్య కేసులో నిందితులను అరెస్టు చేయలేదని రామారావు నిశ్వ ప్రజానాయకుడని తెలిపారు. పాతర్లపాడు గ్రామానికి రెండుసార్లు ఏకగ్రీవ సర్పంచిగా పనిచేశారని, ఆయన సతీమణి స్వరాజ్యం ఒకసారి సర్పంచ్ గా పని చేశారని తెలిపారు. పేదలకు సొంత స్థలాల స్థలాలకు పంచిన చరిత్ర రామారావుది అని తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా, రాష్ట్ర నాయకుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని పేర్కొన్నారు. సుమారు 50 సంవత్సరాలు పాటు సీపీఐ(ఎం)లో, ప్రజా సంఘాలలో పని చేసినట్లు తెలిపారు. పేదలు, రైతుల పక్షాన అనేక ఉద్యమాలు జరిగాయి. గత ఇటీవలంటూ పాతర్లపాడులో రామారావు గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారని, ఇది సహించలేని సంఘ విద్రోహ శక్తులు ఆయన ఉంటే మనుగడ సాగదని భావించి కుట్ర చేసి హత్య చేశారని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. రామారావుని హత్య చేసిన హంతకులను, కుట్రకు పాల్పడిన వారిని అరెస్టు చేసి చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు టీ జ్యోతి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, మల్లు లక్ష్మి, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ఉన్నారు.
– ప్రకటన –

