IPL 2026 ప్లేఆఫ్‌లు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కు సంబంధించి లీగ్ సమరం ముగిసింది. హైదరాబాద్, గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్ ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి.. పాయింట్ల పరంగా చూస్తే బెంగళూరు, గుజరాత్ జట్లు బలంగా కనిపిస్తున్నాయి. నెట్ రన్ రేట్ కూడా ఈ జట్లకు మెరుగ్గా ఉంది. అలాగని రాజస్థాన్, హైదరాబాద్ జట్లను అంత సులభంగా తీసుకోవడానికి లేదు.
గ్రూప్ దశలో జరిగిన పోరాటాలు ఒక విధంగా.. ప్లే ఆఫ్ దశలో పోరాటాలు మరొక విధంగా ఉంటాయి. అందువల్లే ఇప్పుడు జరిగే పోటీలను పాయింట్ల పరంగా చూసుకోరు. నెట్ రన్ రేట్ పరంగా చూసుకోరు. కేవలం విజయమో.. వీర స్వర్గమో అన్నట్టుగానే భావిస్తున్నారు. హైదరాబాద్, గుజరాత్ జట్లకు కాస్త వెసులుబాటు ఉంది. ఎందుకంటే ఆ రెండు జట్లకు రెండు అవకాశాలుంటాయి. కానీ హైదరాబాద్, రాజస్థాన్ జట్లకు మాత్రం ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్ లాగే ఉంటుంది.
ఈ సీజన్లో గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్, బెంగళూరు.. ఇలా ఏ జట్టు ట్రోఫీ గెలిచినా సరే రెండవది అవుతుంది. ఎందుకంటే బెంగళూరు 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత గత ఏడాది విజేతగా నిలిచింది. ఈసారి కూడా ట్రోఫీ గెలిస్తే వరుసగా రెండవసారి విజేతగా నిలుస్తుంది.
గుజరాత్ కూడా 202లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక ఈ సీజన్లో గనుక గుజరాత్ విజేతగా నిలిస్తే రెండవ టైటిల్ ఆ జట్టులో ఉంటుంది.
హైదరాబాద్ 2016లో విజేతగా ఆవిర్భవించింది. 204లో ఫైనల్ వరకు వెళ్ళడానికి ట్రోఫీ అందుకోలేకపోయింది. అయితే ఈసారి గెలిస్తే మాత్రం రెండవ ట్రోఫీ తన ఖాతాలో వేసుకుంటుంది.
రాజస్థాన్ 2008లో షేన్ వార్న్ నాయకత్వంలో ట్రోఫీ అందుకుంది. ఇంతవరకు మరొకసారి విజేతగా నిలవలేదు. అయితే ఈసారి గనుక ఆ జట్టు గెలిస్తే రెండవసారి ట్రోఫీ అందుకున్న చరిత్రను తన ఖాతాలో లిఖించుకుంటుంది.
ఈసారి ఐపీఎల్లో ఈ నాలుగు జట్లు బలంగా పోరాటాన్ని సాగించాయి. ప్లే ఆఫ్ దశ దాకా వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వెనుకబడినప్పటికీ.. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో విజయాలు సాధించి ఇక్కడ దాకా వచ్చాయి. ఈ జట్ల మధ్య పోరాటాలు చూసేందుకు అభిమానులు వేయికళ్లతో ఉన్నారు.
ఇదంతా పవర్హౌస్లతో ప్రారంభమైంది!
… 4️⃣
ప్రతి ఛేజింగ్ ట్రోఫీ నం. 2️⃣ #TATAIPL | #TheFinalLeap | #RCBvGT | #SRHvRR pic.twitter.com/9aXpMAEE1x
— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 25, 2026

