తెలంగాణ:పాలకుర్తి ఇరిగేషన్ శాఖలో డీఈగా పనిచేస్తున్నారు శ్రీకాంత్ ఏసీబీ వలలో చిక్కారు.ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.50 వేల లంచం హన్మకొండ తన నివాసంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు ముందస్తుగా పథకం రచించిన ఏసీబీ అధికారులు, కాంట్రాక్టర్ ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
పనులకు సంబంధించిన బిల్లులు,అధికారిక అనుమతుల విషయంలో డీఈ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేస్తున్నారు.ఈ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేల నగదు నగదు స్వాధీన పరుచుకుని అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.అనంతరం శ్రీకాంత్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు, నగదు లావాదేవీలపై అధికారులు నిఘాపెట్టినట్లు సమాచారం.ఈ ఘటనతో ఇరిగేషన్ శాఖలో కలకలం రేగింది.
కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

