తెలంగాణ:సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం(వివాహేతర సంబంధం) దారుణ హత్యకు దారితీసింది.ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.
అనంతరం జేసీబీతో గొయ్యి తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డికి,మనూరు మండలానికి చెందిన కల్పనతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి 11 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
బయటకు సాఫీగా కనిపించిన ఈ కుటుంబ జీవితం మూడు నెలల క్రితం కొత్త మలుపు తిరిగింది.నారాయణఖేడ్‌లోని ( నారాయణఖేడ్ ) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కల్పనకు మనూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన బేగరి పండరి అలియాస్ చింటూతో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది.దీంతో తమ సంబంధానికి భర్త ముత్యంరెడ్డి అడ్డుగా ఉన్నాడని భావించిన కల్పన,చింటూ కలిసి అతడిని హత్య చేయాలని పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.
పథకం ప్రకారమే ముత్యం రెడ్డిని హత్య చేసిన నిందితులు.ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలంలో జేసీబీతో పెద్ద గొయ్యి తీయించారు.
అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టి.పైభాగంలో రాళ్లు వేసి ఆనవాళ్లు కనిపించకుండా చేశారు.
హత్య అనంతరం భర్త కనిపించడం లేదంటూ కల్పన పోలీసులకు ఫిర్యాదు చేసింది.మిస్సింగ్ డ్రామా ఆడినట్లుగా విచారణలో వెల్లడైంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.అయితే తొమ్మిది రోజులు గడిచినా ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.
తామే ముత్యంరెడ్డిని హత్య చేసి పూడ్చిపెట్టినట్లు కల్పన,చింటూ ఒప్పుకున్నట్లు సమాచారం.అనంతరం పోలీసులు నిందితులు చెప్పిన ప్రదేశానికి వెళ్లి.
పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు.తహశీల్దార్ సమక్షంలో అక్కడే పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.


