మహేష్ బాబుకు స్టార్ హీరోల అభిమానులు: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి సినిమానే మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీకి పరిమితమైన మహేష్ బాబు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి రాజమౌళి ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో మహేష్ బాబు సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. లేకపోతే చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇక ఏది ఏమైనా ఈ సినిమా కోసం దాదాపు 1500 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా 3000 కోట్ల పైన కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. కాబట్టి రాజమౌళి దానిని దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా సేఫ్ గేమ్ ఆడాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ పిక్స్ ను కూడా బయటికి రానివ్వడం లేదు. కారణం ఏంటంటే మేకింగ్ వీడియోలను ఫ్లిక్స్ లో రిలీజ్ చేయడానికి కూడా నెట్ ఏర్పాట్లు చేస్తున్నారు.
దాని వల్ల కూడా బిజినెస్ జరుగుతుందని ఆలోచిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా రాజమౌళి లాంటి దర్శకుడు నుంచి వచ్చే సినిమా ది బెస్ట్ అవుట్ పుట్ తో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రాజమౌళిని ఆదర్శంగా తీసుకొని ఆయన లాగా సినిమాలు చేయాలని చూస్తున్నారు…
ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు. ఇక ఇప్పుడున్న హీరోల్లో కొందరు మహేష్ బాబు అభిమానులని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు మహేష్ బాబుకు వీరాభిమానులమని గతంలో పలు సందర్భాల్లో తెలియజేశారు.
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కి రావాలనే ఇంట్రెస్ట్ తర్వాత ఇండస్ట్రీకి రావాలంటే వద్దా అని అనుకున్న టైంలో మహేష్ బాబు సినిమాలు చూడడం అతని నటనకు ఇంప్రెస్ అయిన వాళ్లు ఎలాగైనా సరే మనం కూడా ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి ప్రస్తుతం స్టార్ హీరోలుగా వారు నిలదొక్కుకుంటున్నారు…

