ఎబోలా వైరస్ పై విశాఖపట్నం అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్నం పరిధిలోని వివిధ వర్సిటీల్లో 400 మందికిపైగా ఆఫ్రికా విద్యార్థులున్నారు. విశాఖ జిల్లా అధికారులు పరిస్థితిని సమీక్షించారు. విశాఖ విమానాశ్రయంలోనూ వివిధ దేశాల నుంచి వస్తున్న వారికి పరీక్షలు చేస్తున్నారు. విశాఖలోని ఆంధ్రయూనివర్సిటీలో కాంగో, ఉగాండా, సూడాన్ దేశాల నుంచి విశాఖలో గీతం, ఆంధ్రా వర్సిటీల్లో విద్యార్థులు నాలుగు వందల మందికి పైగా చదువుతున్నట్లు సమాచారం.
యూనివర్సిటీలో చదువుతూ…
వీరిలో కొంత మంది ఇక్కడ వసతి గృహాల్లో ప్రస్తుతం ఉండగా, మరికొందరు సొంత దేశాలకు వెళ్లారు. వీరంతా తిరిగి వర్సిటీలకు త్వరలో రానున్నారు. అలాగే కొత్త అడ్మిషన్లు వంద వరకు జరిగినట్లు సమాచారం. వీరంతా వచ్చే జూన్లో అడ్మిషన్ల కోసం వర్సిటీలకు రానున్నారు. ఇలాంటి వారి జాబితా అధికారులు సేకరించారు. వారు విశాఖకు చేరుకుంటే పరీక్షలు నిర్వహించి వైరస్ లక్షణాలుంటే క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయించారు.

