చమురు సంస్థలు సీఎన్జీ ధరలను మరోసారి పెంచాయి. పెట్రోలు, డీజిల్ ధరలను ఇప్పటికే నాలుగు సార్లు పెంచిన చమురు సంస్థలు తాజాగా సీఎన్జీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కిలో సీఎన్జీ పై రెండు రూపాయల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
నేటి నుంచే పెరిగిన ధరలు…
పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. పదకొండు రోజుల్లో నాలుగవ సారి సీఎన్జీ ధర పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర ఎనభై మూడు రూపాయలకుచేరింది. పశ్చిమాసియాలోయుద్ధం ప్రభావంతో క్రూడాయిల్ ధరలు పెరగడంతో చమురు కంపెనీలు పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి.

