– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్: కొహెడ సమీపంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఎయిరిండియాకు చెందిన బస్సు దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. శంషాబాద్ నుంచి నగరంలోకి వస్తుండగా ఈ బస్సు ఘటన జరిగింది.
– ప్రకటన –

