- పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి
- ఉగ్రవాదానికి వ్యతిరేకంగా క్వాడ్ దేశాలు ఉన్నాయి
- స్పష్టం చేసిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ
భారత్ అధ్యక్షతన ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు భేటీ అయ్యాయి. ప్రధానంగా ఈ ఉగ్రవాద నిరోధక చర్యలు అంశంగా చర్చకు వచ్చినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నాగరాజ్ నాయుడు కాకనూర్. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ముఖ్యంగా సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదాన్ని క్వాడ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.
క్వాడ్ సంయుక్త ప్రకటనలో 2025 ఏప్రిల్‌లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ప్రత్యేకంగా ఖండించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు, వాటికి ఆర్థిక సహాయం అందించే సంస్థలు, మద్దతుదారులపై అంతర్జాతీయ సమాజం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని విదేశాంగ మంత్రులు మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమన్వయంతో పనిచేయడం, గ్లోబల్ స్థాయిలో భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేయడం అవసరమని దేశాలు అభిప్రాయపడ్డాయని.
అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంత సముద్ర భద్రత, సముద్ర మార్గాల బలంపై కీలక చర్చలు జరిగాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, నిరంతర వాణిజ్య రవాణా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రులకు ప్రాధాన్యతనిస్తుందని వివరించారు. ఇండో-పసిఫిక్ ఫర్ పార్ట్నర్షిప్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ (IPMDA) కింద క్వాడ్ సహకారాన్ని మరింత విస్తరించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతమంతటా సమగ్ర సముద్ర కార్యకలాపాల పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా క్వాడ్ దేశాలు ‘ఇండో-పసిఫిక్ మారిటైమ్ సర్వైలెన్స్ కలాబరేషన్’ (IPMSC) అనే కొత్త వ్యవస్థను ప్రారంభించినట్లు. సముద్ర నిఘా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యమని తెలియజేసారు. అత్యాధునిక సాంకేతికతల సమన్వయంతో ఈ IPMSC వ్యవస్థ పనిచేస్తుందని.. దీని ద్వారా IPMDA మరింత పెరుగుతాయని నాగరాజ్ నాయుడు కాకనూర్ సామర్థ్యాలు. రియల్‌టైమ్ పరస్పరం పంచుకోవడం, సముద్రంలో సంచరించే నౌకల కదలికలపై మరింత స్పష్టంగా అందించడంలో ఇది కీలకంగా మారనుందని చెప్పారు.
అలాగే కీలకమైన ఖనిజాల సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ‘క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్‌వర్క్’ని కూడా ప్రకటించింది. ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా కీలకమైన ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, పెట్టుబడుల రంగాల్లో పరస్పర సహకారం పెంచాలని క్వాలిటీ దేశాలు నిర్ణయించాయని చెప్పారు. ఆధునిక సరఫరా వ్యవస్థలను చేయడం ద్వారా తయారీ రంగం అభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలకు మద్దతు అందించడమే దీని లక్ష్యమని తెలియజేసారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యాన్ని పెంచుతూ పెట్టుబడుల సౌలభ్యం, నియంత్రణ విధానాలు, రీసైక్లింగ్ సాంకేతికతలు, బలమైన సరఫరా వ్యవస్థలపై సహకారాన్ని మరింతగా విస్తరించేందుకు క్వాడ్ దేశాలు అంగీకరించాయని తెలిపారు. ఇక మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణా, అంతరాయాలు లేని వాణిజ్యం, నావికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వబడిన క్వాడ్ విదేశాంగ మంత్రులు తెలియజేశారు నాగరాజ్ నాయుడు కాకనూర్.
#చూడండి | ఢిల్లీ: క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో, MEA అదనపు కార్యదర్శి (AMS – USA & కెనడా) నాగరాజ్ నాయుడు కాకనూర్ మాట్లాడుతూ, “ఆర్థిక భద్రత మరియు స్థితిస్థాపక సరఫరా గొలుసులు చర్చలలో ప్రముఖంగా ఉన్నాయి. క్వాడ్ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్‌ను ప్రకటించింది… pic.twitter.com/eQOtUTGyT3
– ANI (@ANI) మే 26, 2026
#చూడండి | ఢిల్లీ: క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో, MEA అదనపు కార్యదర్శి (AMS – USA & కెనడా), నాగరాజ్ నాయుడు కాకనూర్ ఇలా అన్నారు, “ఉగ్రవాద నిరోధకం క్వాడ్ సహకారానికి ముఖ్యమైన స్తంభం. మంత్రులు తీవ్రవాదాన్ని దాని అన్ని రూపాలు మరియు వ్యక్తీకరణలలో తీవ్రంగా ఖండించారు,… pic.twitter.com/iLDkTVqI7q
– ANI (@ANI) మే 26, 2026
#చూడండి | ఢిల్లీ: క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో, MEA అదనపు కార్యదర్శి (AMS – USA & కెనడా), నాగరాజ్ నాయుడు కాకనూర్ మాట్లాడుతూ, “ఇండో పసిఫిక్‌లో సముద్ర భద్రత మరియు స్థితిస్థాపక సముద్ర సంబంధాల యొక్క ప్రాముఖ్యతను మంత్రులు నొక్కిచెప్పారు. క్వాడ్ తన సహకారాన్ని విస్తరించింది… pic.twitter.com/vv5lUfAW8D
– ANI (@ANI) మే 26, 2026
#చూడండి | ఢిల్లీలో భారత్-ఆస్ట్రేలియా-జపాన్-అమెరికా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం
(వీడియో మూలం: DD) pic.twitter.com/sOo2sEuQR0
– ANI (@ANI) మే 26, 2026

