ఆంధ్రప్రదేశ్:రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ( ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి )సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రెండేళ్ల క్రితం మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
తోపుదుర్తి రాజశేఖరరెడ్డి వేధింపుల వల్లే యువకుడు మరణించారని అనంతపురం రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.రాజకీయ వేధింపుల్లో భాగంగానే తోపుదుర్తి రాజశేఖరరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

