మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగిపోయారు. భార్యతో కలసి పోలీసుల ఎదుట నరహరి లొంగిపోయారు. నరహరితో పాటు మరో నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. నరహరి లొంగుబాటును పోలీసులు ఈరోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
వందలాది మంది …
ఇటీవల కాలంలో వరసగా మావోయిస్టు కీలక నేతలందరూ లొంగిపోతున్నారు. ఆపరేషన్ కగార్ గడువు ముగిసినప్పటికీ ఇప్పటికీ మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కోసం ఇంకా భద్రతాదళాలు జల్లెడ పడుతుండటంతో ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు.

