- ప్లేస్ లేదంటూ మిల్లర్ల కొర్రి.. తక్షణ వెతుకుతున్న అధికారులు
- కొన్ని మిల్లుల్లో ఆన్లోడ్ కానీ లారీలు
- ఇప్పటి వరకు 2.50 లక్షల టన్నుల వరకు కొనుగోలు
- ఇంకా 2 లక్షల టన్నులు టార్గెట్
యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి వడ్ల కొనుగోలుకు జాగ పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే తాత్కాలిక గొడౌన్లు తీసుకున్నారు. అయినా కొనుగోలు చేస్తున్న వడ్లకు జాగ సరిపోవడం లేదు. దీంతో పక్క జిల్లాల్లో జాగ దొరుకుతుందేమోనన్న వేటలో అధికారులు పడ్డారు.
2.40 లక్షల టన్నుల కొనుగోలు..
యాదాద్రి జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 3.14 లక్షల ఎకరాల్లో వరి పండించారు. 6.92 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని, ఇందులో 4.50 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 2.40 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. 2.10 లక్షల టన్నుల వడ్లను మిల్లులకు పంపించారు. అయితే హమాలీల సమస్య కారణంగా మిల్లుల్లో వడ్లు స్పీడ్‌గా అన్లోడ్ కావడం లేదు.
పైగా మిల్లుల్లో ఖాళీ కొరత ఉందని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. దీంతో మిల్లులకు వెళ్లిన లారీలు రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయి. దీంతో మరో 30 వేల టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయి.
పాత స్టాక్ 3.25 లక్షల టన్నులు..
ఇప్పటికే లక్షల టన్నుల వడ్ల స్టాక్ ఉంది. సీఎంఆర్‌లో మిల్లర్లు జాప్యంతో పాటు ఎఫ్‌సీఐ పాత్ర కూడా ఉండటంతో మిల్లుల్లో స్టాక్ పేరుకుపోయింది. 2022 యాసంగి సీజన్‌కు సంబంధించి 39 వేల టన్నులు, 2025 యాసంగికి చెందిన 86 వేల టన్నుల వడ్లు, వానాకాలం సీజన్‌కు చెందిన 2 లక్షల టన్నుల వడ్ల స్టాక్ కూడా ఉంది.
మొత్తంగా మిల్లుల్లో 3.25 లక్షల టన్నుల వడ్లు ఉన్నాయి. వీటితో పాటు తాజాగా కొనుగోలు చేసిన 2.50 లక్షల టన్నులు కలుపుకుంటే 5.65 లక్షల టన్నుల వడ్లు మిల్లుల్లోనే ఉన్నాయి. ఈ పరిణామంతో మిల్లుల్లో వడ్లను స్టోర్ చేయడానికి జాగ సమస్య.
లక్ష టన్నుల వడ్లకు జాగ లేదు..
టార్గెట్ ప్రకారం మరో 2 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాల్సి ఉన్నా కొనుగోలు కేంద్రాలలో అంతకు మించిన వడ్ల కుప్పలు నిల్వలు ఉన్నాయి. ఇప్పటికే ఖాళీ కొరత కారణంగా 60 వేల టన్నుల కెపాసిటీ కలిగిన ఇంటర్మీడియట్ గోడౌన్లు తీసుకొని అన్లోడ్ చేయించుకునే పనిలో ఉన్నారు. అయినప్పటికీ మరో లక్ష టన్నుల వడ్లను స్టోర్ చేయడానికి జాగ లేదు.
ఇందులో 25 వేల టన్నుల వడ్లను జనగామ జిల్లాకు పంపించడానికి ఓకే చేసినా అక్కడి మిల్లులకు సీఎంఆర్ కోసం బాయిల్డ్ కాకుండా ఎక్కువగా రా రైస్ ఇచ్చారు. దీంతోపాటు అక్కడి మిల్లర్లు తాము మూసీ పరిధిలోని పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట, బీబీనగర్ మండలాల పరిధిలోని వడ్లు తీసుకోమని ఇప్పటికే చెప్పారు. చివరకు 5 వేల టన్నుల వడ్లను తీసుకోవడానికి ఓకే చెప్పారు. హన్మకొండకు మరో 2500 టన్నుల వడ్లకు ఓకే చెప్పారు.
జాగ వేటలో ఆఫీసర్లు..
వడ్లను స్టోర్ చేయడానికి సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ జాగ వేటలో పడిపోయింది. ఇందులో భాగంగానే చౌటుప్పల్‌లోని ఓ ప్రయివేటు గోడౌన్లో 10 వేల టన్నుల వడ్లు స్టోర్ చేసే జాగను తీసుకున్నారు. వంగపల్లిలో 12 వేల టన్నుల గోడౌన్, సూర్యాపేట జిల్లా తిర్మలగిరిలో మరో 10 వేల టన్నుల దుకాణం తయారు చేయబడింది. అయినప్పటికీ మొత్తానికి లక్ష టన్నులను స్టోర్ చేయడానికి జాగ సమస్య ఏర్పడింది. ఇతర జిల్లాల గోడౌన్లకు పంపిన ఆ తర్వాత అక్కడి మిల్లులకే కేటాయిస్తానని అధికారులు చెబుతున్నారు.

