విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం ప్రతి బుధవారం గ్రామపంచాయతీల్లో స్వచ్ఛపథం కార్యక్రమంలో భాగంగా స్థానిక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం ప్రత్యేక శుభ్రత కార్యక్రమం జరిగింది. నార్పల నుంచి కేశేపల్లి వెళ్లే ప్రధాన రహదారి, స్మశాన వాటిక ప్రాంతం సమీపంలో పారిశుద్ధ్య పనులు జరిగాయి. రహదారి ఇరువైపులా పెరిగిన కంపచెట్లు, గడ్డి, మట్టి దిబ్బలను తొలగించి రహదారిని పూర్తిగా శుభ్రం చేశారు. అనంతరం కూతలేరు వంకపై ఉన్న చిన్న బ్రిడ్జిపై పేరుకుపోయిన చెత్త, కంపను కూడా తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ఈ రహదారి మరింత సుగమంగా మారి ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించినట్లు అధికారులు తెలిపారు.ఈ ఎంపీడీవో మమతా దేవి ఆధ్వర్యంలో నిర్వహించగా, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు ఉన్నారు.

