తెలంగాణ:జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్‌పై తీసుకున్న చర్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది./పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలను నిరసిస్తూ. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,(మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్) స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా చేసే సమయంలో “ముందు రైతుల వడ్లు కొనండి” అని వ్యాఖ్యానించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల నుంచి తొలగిస్తూ రీజినల్ మేనేజర్ రిమూవల్ లెటర్ జారీ చేయడం వివాదాస్పదమైంది.
అందుతున్న సమాచారం ప్రకారం…జగిత్యాలలో కాంగ్రెస్ నేతలు పెట్రోల్,డీ ధరల పెంపుపై నిరసన చేపట్టిన సమయంలో అక్కడ నుండి వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అశోక్ “ముందు వడ్లు కొనుగోలు గురించి మాట్లాడండి” అన్నాడు.ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు కించపరిచేలా మాట్లాడినట్లు జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ ఫిర్యాదు ఆధారంగా ఆర్టీసీ యాజమాన్యం అశోక్‌పై చర్యలు తీసుకుని, డ్యూటీకి హాజరుకావద్దంటూ రిమూవల్ లెటర్ జారీ చేసినట్లు తెలిసింది.ఈ వ్యవహారంపై స్పందించారు అశోక్ డ్రైవర్.
( Driver Ashok).తాను ఏ రాజకీయ పార్టీని అయినా,ఏ నాయకుడిని అయినా, విమర్శించలేదని చెప్పాడు.
రైతుల సమస్యల గురించి మాట్లాడానని, అయినప్పటికీ తనపై కఠిన చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.“ఆర్ఎం నుంచి రిమూవల్ లెటర్ వచ్చింది.
ఐదు డిపోలకు కూడా నాకు డ్యూటీ వేయొద్దని సమాచారం ఇచ్చారు.నేను రైతుల కోసం మాత్రమే మాట్లాడాను” అని పేర్కొన్నాడు.
ఈ ఘటనపై రాజకీయ రంగు పులుముకోవడంతో ప్రతిపక్ష నేతలు కూడా స్పందించారు.మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (ఎమ్మెల్యే గంగుల కమలాకర్ )తీవ్రంగా సమస్యలపై స్పందిస్తూ…“మా ప్రభుత్వ రైతాంగం గురించి మాట్లాడితే ఉద్యోగాలు తీస్తారా? మా ప్రభుత్వ హయాంలో కూడా అనేక విమర్శలు వచ్చాయి.కానీ, ఎవరినీ ఇలా ఇబ్బంది పెట్టలేదు” అన్నారు.
ఈ ఘటన జగిత్యాల జిల్లాలో రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.


