- హస్తినలో కొనసాగుతున్న సీఎం విజయ్ పర్యటన
- సాయంత్రం ప్రధాని మోడీతో సమావేశం
- అనంతరం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ
- రాష్ట్రానికి సంబంధించిన చర్చ
హస్తినలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పర్యటన కొనసాగుతోంది. ప్రధాని మోడీని కలిసిన విజయ్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు పలు కీలక చర్చలు జరిగాయి. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం విజయ్ భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో తమిళనాడుకు సంబంధించిన పలు ఆర్థిక, అభివృద్ధి చర్చలు జరిగినట్లు సమాచారం. రాష్ట్రానికి కేటాయింపు నిధులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల పెట్టుబడులు, డిజిటల్ మరియు రక్షణ రంగాల్లో సహకారం వంటి కేంద్ర అంశాలు విజయ్ ప్రస్తావనలు ఉన్నాయి. అలాగే ఆర్థిక, కేంద్ర-రాష్ట్ర సమన్వయ పరిస్థితి, అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం వంటి అంశాలు కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. తమిళనాడులో పెట్టుబడులను మరింత పెంచేందుకు కేంద్రం సహకరించాలని విజయ్ కోరినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాని మోడీతో కూడా విజయ్ సమావేశమై తమిళ మేకేదాటు ప్రాజెక్టు, థాయ్, డీఆర్డీవో సెంటర్ వంటి కీలక అంశాలను ప్రస్తావించారు. అయితే ఢిల్లీ పర్యటనలో మరికొందరు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలిసే ఛాన్సుందని తెలుస్తోంది.
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తమిళనాడు సీఎం సీ జోసెఫ్ విజయ్ భేటీ అయ్యారు.
(చిత్రాలు: FM నిర్మలా సీతారామన్ కార్యాలయం) pic.twitter.com/WQxOzNREf4
– ANI (@ANI) మే 27, 2026

