ప్రొఫెసర్ నాగేశ్వర్: “తెలుగుదేశం పార్టీకి క్రెడిబులిటీ లేదు. తెలుగుదేశం పార్టీని నమోదు చేసింది. బీజేపీ తన స్నేహితులను మోసం చేస్తుంది. పైరవీల కోసం జనసేన అధినేత కేవలం హస్తిన వెళ్తాడు.. జగన్ అరెస్టు విషయంలో కూటమి పార్టీలలో విభేదాలు ఉన్నాయి. అలాంటి మాటలు మాట్లాడింది ఓ అపోజిషన్ లీడరో, మరో నాయకుడో కాదు. విశ్లేషకుడి రూపంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్.
ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహార శైలి చూస్తుంటే జగన్ ను ముందు పెట్టి కూటమిని కొడుతున్నట్టు కనిపించింది.. పవన్ కళ్యాణ్, అమిత్ షా భేటీ మీద రకరకాల వ్యాఖ్యలు చేసింది ప్రొఫెసర్ నాగేశ్వర్. చివరికి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది కూడా అతనే. తప్పుడు ఆరోపణలు ఆయన మీద జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. చివరికి విక్టిమ్ కార్డు ప్లే చేయడం కూడా తనే.. అసలు ఇన్ని రకాలుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకు చేశారన్నారు.
నాగేశ్వర్ వ్యవహార శైలి ఎలా ఉందంటే.. నేను బురద చల్లుతాను.. కడుక్కోవడం నీ కర్మ ఆనట్టుగా ఉంది. విశ్లేషకుడిగా ఉండి.. న్యూట్రల్ గా వ్యవహరిస్తూ.. వర్తమాన అంశాల మీద.. రాజకీయ అంశాలపై విశ్లేషణ చేయాల్సిన నాగేశ్వర్ ఇలా దారి తప్పడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది.. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం.. రాజకీయ పార్టీలు కొనసాగుతున్న విధానాలను తప్పు పట్టడం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. నిజానికి నాగేశ్వర్ ఇలా మాట్లాడతారని ఎవరూ ఊహించడం లేదు.. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ఇంతవరకు ఆయన మీద కేసులు పెట్టలేదు. కనీసం అరెస్టు చేయడానికి కూడా ప్రయత్నించలేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా నాగేశ్వర్ అరెస్టు మీద క్లారిటీ ఇచ్చారు. ఆయనను అరెస్టు చేయకూడదని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు ఈ వివాదం ఇంకా లాగడం ఎందుకు.. అసలు దీనిని వివాదం చేసింది ఎవరు.. ఇప్పుడు సింపతి కార్డు ప్లే చేస్తున్నారు ఎవరు.. యుద్ధం ప్రారంభం.. ముగింపు అంటూ మాటలు మాట్లాడుతున్నారు ఎవరు.. ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబునాయుడు.. పవన్ కళ్యాణ్
టిడిపి సోషల్ మీడియా ఒక అడుగు ముందుకేసి.. కాస్త అతిని ప్రదర్శించింది. ఇటీవల నాగేశ్వర్ మెడకు వైసిపి కండువా వేసి.. సోషల్ మీడియాలో ఫోటోలు పబ్లిష్ చేసింది. దానికి నాగేశ్వర్ అనుకూల పెయిడ్ ఆర్టిస్టులు గొంతులు చించుకున్నారు. కానీ ఇప్పుడు నాగేశ్వర్ వ్యవహార శైలి చూస్తే టిడిపి సోషల్ మీడియా చేసిన పని నూటికి నూరుశాతం ఉత్తమమైనదే అనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుడిగా ఉండి.. ఒక పార్టీ అనుకూల వ్యాఖ్యలు చేయడం దేనికి.. నేరుగా రాజకీయాలలోకి వచ్చి మాట్లాడాలని టిడిపి, జనసేన పార్టీ నాయకులు పిలుపునిస్తున్నారు. మరి వీటిని మాజీ ఎమ్మెల్సీ ఎలా స్వీకరిస్తారు.. ఇకపై ఎలా మాట్లాడతారనేది చూడాల్సి ఉంది. ఇప్పటికైతే దీనిని ఆంధ్ర తెలంగాణ వివాదం కాకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు. అంతేకాదు కేసుల పెట్టకూడదని పోలీసులకు స్పష్టం చేశారు. ఇప్పటికైనా నాగేశ్వర్ కు అనుకూలంగా స్వరం సవరిస్తున్నవారు సైలెంట్ అయిపోతారా.. ఇంకా రాద్ధాంతం చేస్తారా.. చూడాల్సింది ఏం జరుగుతుందో..

