- భాగస్వామితో తీవ్రమైన విమర్శలు, నిరాశలు చెప్పవద్దు.
- ఆర్థిక, వృత్తిపరమైన ఆందోళనలను వెంటనే పంచుకోవద్దు.
- తోటివారి పట్ల ఆకర్షణ, ఒంటరితనం గురించి జాగ్రత్తగా చెప్పాలి.
- కోపంలో, తొందరపాటులో భావోద్వేగాలను వ్యక్తపరచడం మానుకోండి.
వైవాహిక జీవితాన్ని నాశనం చేసే తప్పులు: ఈ రోజుల్లో మ్యారేజ్ రిలేషన్స్ ఒకప్పటిలా ఉండట్లేదు. ఇప్పుడు ప్రేమ ఒక్కటి ఉంటే సరిపోదు. మీ పార్టనర్‌ని అర్థం చేసుకోవడం, వారిపై నమ్మకం ఉంచడం, సరైన సమయంలో సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం కూడా కీలకంగా మారుతోంది. చాలామంది భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదని చెప్తారు. కానీ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ మాత్రం కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే పార్టనర్‌తో పంచుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మితిమీరిన నిజాయితీ సంబంధాలలో దూరాన్ని, అపార్థాలను పెంచుతుందని అంటున్నారు.
అందుకే మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే.. కొన్ని భాగస్వామికి ఎప్పుడూ చెప్పకూడదని అంటున్నారు. లేదంటే మీ జీవితం నరకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అలా చెప్పకూడని అంశాలు ఏంటో.. ఆ పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో చూసేద్దాం.
రిలేషన్ ని దెబ్బతీసే విషయాలు
కొన్నిసార్లు కోపం, ఒత్తిడి లేదా తాత్కాలిక భావోద్వేగాలతో మీరు మీ భాగస్వామితో చెప్పే మాటలు మీ రిలేషన్షిప్లో దీర్ఘకాలిక విద్వేషాన్ని క్రియేట్ చేస్తాయి. మీ రిలేషన్ గురించి మీకు ఉన్న నిరాశ, కన్ఫ్యూజన్ లేదా అభద్రతను వ్యక్తం చేయడం వల్ల.. మీ పార్టనర్‌లో భయం, తాజాగా రెండూ పెరుగుతాయి.
ఆర్థిక విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వృత్తిపరమైన విషయాలు లేదా ఆర్థికంగా సంబంధించిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పదేపదే మానేయడం, జాబ్ ఉద్యోగం కెరీర్ మార్చుకోవడం లేదా భవిష్యత్తు గురించి నిరంతరం ఆందోళన వ్యక్తం చేయడం నిరంతర రిలేషన్లో గొడవలను పెంచుతాయి. ఎందుకంటే వైవాహిక జీవితం కేవలం భావోద్వేగాలకు సంబంధించినది కాదు.. బాధ్యతలకు సంబంధించినది కూడా. మీరు ఇలాంటివి చేస్తే మీ పార్టనర్ ఆర్థిక భద్రత గురించి ఆందోళన చెందవచ్చు.
లోపాలను నేరుగా చెప్పకండి..
చాలామంది రిలేషన్లో పూర్తి నిజాయితీగా ఉండాలనే ఉద్దేశ్యంలో కోపాన్ని ఎక్కువగా చూపిస్తారు. ఫోన్ ఎక్కువగా వాడటం, తమతో సమయం గడపలేదని పదే పదే కోపం ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ అవి మీ పార్టనర్‌కి ఫిర్యాదులుగా అనిపించవచ్చు. అలాగే కొందరు భర్త లేదా భార్యలోని లోపాలను నేరుగా చెబుతారు. లేదా ఊరికే వాటి గురించి మాట్లాడి చులకన చేస్తారు. కాబట్టి మీరు చెప్పే మాట సరైన విధంగా లేకుంటే.. అవతలి వ్యక్తి దానిని సలహాగా కాకుండా.. హేళన చేస్తున్నారనే ఫీలింగ్‌లోకి వెళ్లిపోతారు. అందుకే చాలా సంబంధాల్లో చిన్న సమస్యలు కూడా పెద్ద గొడవలుగా మారుతాయి. కమ్యూనికేషన్ సరిగ్గా లేకుంటే ఎంతటి బంధమైనా చేజారిపోతుంది.
తప్పక గుర్తించాల్సిన విషయాలు
మీకు పెళ్లైన తర్వాత ఇతరుల పట్ల అట్రాక్ట్ అవ్వడం తప్పు అని అంటున్నారు నిపుణులు. ఇలాంటి విషయాలు మీ పార్టనర్‌కి తెలిస్తే అవి రిలేషన్‌షిప్‌ని మరింత డ్యామేజ్ చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ విషయాలను పార్టనర్‌తో పంచుకుంటారు. దీనివల్ల భాగస్వామిలో అభద్రతను, అపనమ్మకం పెరుగుతుంది. మీపై ఉన్న నమ్మకాన్ని అవి పూర్తిగా దెబ్బతీయగలవు.
ఒంటరితనం కూడా శత్రువే..
ఈ రోజుల్లో వైవాహిక జీవితంలో మానసిక ఒంటరితనం అనేది పెద్ద సమస్యగా మారుతోంది. చాలామంది మ్యారేజ్ లైఫ్‌లో ఒంటరిగా ఉంటుంది. అయితే ఈ భావాలను వ్యక్తపరిచే విధానం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. సరైన పద్ధతిలో.. సరైన విధంగా చెప్పకపోతే అవతలి వ్యక్తి అపరాధభావనకు గురై.. సంబంధంలో దూరం పెరగవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పార్టనర్‌తో ప్రతి నిజాన్ని వెంటనే చెప్పడం అంతమంచిది కాదు. కొన్నిసార్లు సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి మాటలను బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి టైం తీసుకున్నా.. చెప్పే విధంగా చెప్తే అన్నీ సర్దుకుంటాయి. కంగారులోనో.. కోపంలోనో.. ఫీలింగ్స్ వ్యక్తం చేయడం మంచిది కాదని అంటున్నారు.
ఇంకా చదవండి

