YCP BJP Relations: బిజెపి విషయంలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ మారుతున్నట్లు అర్థం అవుతోంది. ఢిల్లీ వర్గాల్లో సైతం ఇది చర్చకు దారితీసింది. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఆలోచనతో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమౌతోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెంపును నిరసిస్తూ ఆందోళనలు, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఓటమికి ఆయన విశ్లేషిస్తున్న కారణాలు.. భారతీయ జనతా పార్టీకి కోపం తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిజెపిని నమ్ముకుంటే రాజకీయంగా తనకు ఇబ్బందులు తప్పవని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఢిల్లీ వర్గాల్లో తనకు జాతీయ స్థాయిలో ఏదో ఒక కూటమి అండ ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం బిజెపి పెద్దల వరకు తెలియడంతో వారు సైతం జగన్మోహన్ రెడ్డి విషయంలో సాఫ్ట్ కార్నర్ విడిచి పెట్టే పరిస్థితి ఏర్పడింది.
* బిజెపి గెలుపు పై సందేహం..
ఏపీలో ప్రత్యేక ఓటరు సవరణ చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. రాజకీయ ప్రత్యర్థుల ఓట్లను తొలగించడమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ అని చెబుతున్నారు జగన్. బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి ఓటరు జాబితా సవరణ కారణం అని తేల్చి చెప్పారు. నుండి బిజెపి గెలుపును తప్పుపట్టారు. ఎన్నికల సంఘం నిర్ణయాలను సైతం ఎత్తిచూపుతున్నారు. మొన్నటికి మొన్న డీజిల్ పెట్రోల్ ధర పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. పశ్చిమ ఆసియా పరిణామాలు పెంపు అనివార్యం అని తెలిసి కూడా.. ఇలా ఆందోళనలు చేయడం ఏంటనేది బిజెపి పెద్దల ప్రశ్న. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి బిజెపితో కటీఫ్ చెప్పేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది.
* మరో కూటమి అండ కోసం..
ప్రస్తుతం ఏపీలో కూటమి బలంగా ఉంది. పైగా మూడు పార్టీల మధ్య సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో బిజెపిని నమ్ముకుంటే ఇబ్బందులు అని జగన్ అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. క్రమేపి కాంగ్రెస్ పెద్దలతో ఆయన రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. తమిళనాడులో విజయ్ గెలుపుతో దక్షిణాది రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా అవతరించాలని కోరుకున్నట్లు సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరిలో వచ్చిన ఈ మార్పుతో బిజెపి పెద్దలు సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వైసిపి తో పాటు జగన్ విషయంలో సాఫ్ట్ కార్నర్ తగ్గించుకోవాలని పెద్దలు కోరుతున్నారు.

