తమని విలన్‌గా చిత్రీకరించడం తగదురష్యా ఐరాసతో మాకు పనిలేదుఇజ్రాయిల్
మాస్కో/ తెలఅవివ్: సంక్షోభ ప్రదేశాల్లో హింసపై ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వార్షిక నివేదిక వివాదంగా మారింది. రష్యా, ఇజ్రాయెల్ పేర్లను చేర్చడంతో ఇప్పుడు ఆ దేశాలు మండిపడ్డాయి. దాదాపు 15 ఏళ్ల కిందట మొదలైన ఈ నివేదికలో తొలిసారిగా ఇజ్రాయిల్ పేరును చేర్చారు. పలస్తీనాలో ఆ దేశ సైనికులు చేస్తున్న హింసకు ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ బందీలపై రష్యా సైనికులు హింసకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రష్యాను కూడా తొలిసారిగా ఈ జాబితాలో చేర్చారు. ఈ నిర్ణయంపై ఐరాసలోని రష్యా రాయబారి వెసెల్లీ నింబెంజియా తీవ్రంగా స్పందించారు. తమ దేశాన్ని విలన్‌గా చిత్రీకరించేలా నివేదికలో అసత్య ఆరోపణలు ఉన్నాయని. మరోవైపు ఇజ్రాయిల్ రాయబారి డానీ డానన్ ఈ నివేదికపై మాట్లాడుతూ… తనకు ఐరాస సెక్రటరీ జనరల్‌తో పనిలేదని అన్నారు. తమను ఐసీస్, హమాస్ వంటి ముఠాల వల్లే చూపించారని.

