ఆంధ్రప్రదేశ్:తూర్పుగోదావరి ఏర్పాటు గోపాలపురం, దేవరపల్లి (గోపాలపురం, దేవరపల్లి )మండలలో గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.భారీ ఈదురు గాలులతో పాటు కుండపోత వర్షం కురవడంతో ప్రాంతమంతా చీకట్లు కమ్ముకున్నాయి.
బలమైన గాలుల ప్రభావంతో ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోగా,దుకానాల సైన్‌బోర్డులు,ఫ్లెక్సీలు నేలకూలాయి.కొన్ని ప్రాంతాల చెట్లు వంగిపడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
భారీ వర్షం కారణంగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలుచోట్ల వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.
అకస్మాత్తుగా మారిన వాతావరణ పరిస్థితులతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు ఉన్నాయి.

